close
నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికపై తెరాస దృష్టి 

జడ్పీటీసీలు, ఎంపీటీసీలతో కేటీఆర్‌ సమావేశం

ఈనాడు, హైదరాబాద్‌: నిజామాబాద్‌ స్థానిక సంస్థల శాసనమండలి స్థానం ఎన్నికపై తెరాస దృష్టి సారించింది. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ గురువారం శాసనసభాపక్ష కార్యాలయంలో జిల్లాకు చెందిన పలువురు జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులతో సమావేశమయ్యారు. ఈ స్థానానికి గతంలో ఎమ్మెల్సీగా ఉన్న భూపతిరెడ్డిపై పార్టీ ఫిరాయింపు చట్టం కింద తెరాస ఫిర్యాదు చేయగా శాసనమండలి ఛైర్మన్‌ అనర్హత వేటు వేశారు. దీనిపై ఆయన న్యాయస్థానానికి వెళ్లగా శాసనమండలి ఛైర్మన్‌ నిర్ణయానికి అనుగుణంగా బుధవారం హైకోర్టు తీర్పు వెలువడింది. ఈ నేపథ్యంలో ఈ స్థానానికి త్వరలోనే ఎన్నిక జరిగే అవకాశం ఉందని, దీనికి ఇప్పటినుంచే కార్యాచరణ చేపట్టాలని తెరాస అధిష్ఠానం నిర్ణయించింది. ఎన్నికల వ్యూహంలో భాగంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటర్లయిన ఎంపీటీసీ, జడ్పీటీసీలను హైదరాబాద్‌కు తీసుకొని రాగా వారితో కేటీఆర్‌ సమావేశమయ్యారు. ఎమ్మెల్సీ వీజీగౌడ్‌, నిజామాబాద్‌ గ్రామీణ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌, ఇతర నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా కేటీఆర్‌ వారితో మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికలో తెరాస అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలని సూచించారు. కొత్త పంచాయతీరాజ్‌ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని కోరారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, సభ్యత్వ నమోదులో చురుకుగా పాల్గొనాలని ఆయన సూచించారు. త్వరలోనే జిల్లాలోని మిగిలిన ఎంపీటీసీలు, జడ్పీటీసీలతోనూ సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. పురపాలక ఎన్నికల అనంతరం ఎమ్మెల్సీ ఎన్నిక జరిగే అవకాశముందని కేటీఆర్‌ వారికి వివరించినట్లు తెలిసింది.

మంత్రి జగదీశ్‌రెడ్డికి సీఎం, మంత్రుల శుభాకాంక్షలు 
విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి జన్మదినం సందర్భంగా గురువారం శాసనసభలో ముఖ్యమంత్రి కేసీఆర్‌, శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. సభాపతి కార్యాలయంలో కేక్‌ను కోసి పంచారు.

రాజకీయం

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.