Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 174525
            [news_title_telugu_html] => 

నమో భారత్‌- నవ తెలంగాణ

[news_title_telugu] => నమో భారత్‌- నవ తెలంగాణ [news_title_english] => [news_short_description] => తెదేపా నుంచి కమలదళంలోకి పెద్దఎత్తున చేరికలకు రంగం సిద్ధమైంది. ‘నమో భారత్‌- నవ తెలంగాణ’ పేరుతో భాజపా హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానంలో బహిరంగ సభ నిర్వహిస్తోంది. [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [news_sections] => ,24,23, ) )
నమో భారత్‌- నవ తెలంగాణ - EENADU
close
నమో భారత్‌- నవ తెలంగాణ

జె.పి.నడ్డా సమక్షంలో కమలదళంలోకి తెదేపా నేతలు
నేడు భాజపా బహిరంగ సభ

ఈనాడు, హైదరాబాద్‌: తెదేపా నుంచి కమలదళంలోకి పెద్దఎత్తున చేరికలకు రంగం సిద్ధమైంది. ‘నమో భారత్‌- నవ తెలంగాణ’ పేరుతో భాజపా హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానంలో బహిరంగ సభ నిర్వహిస్తోంది. ఆదివారం సాయంత్రం 4 గంటలకు జరిగే సభకు ఆ పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు జె.పి.నడ్డా ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. తెదేపాకు చెందిన కేడర్‌, నేతలు భాజపాలో చేరనున్నారు. రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి నేతలు సహా దాదాపు 20 వేల మంది తమ పార్టీలోకి వస్తున్నారని పార్టీవర్గాలు వెల్లడించాయి. తెదేపా రాజ్యసభ సభ్యులతో కలిసి దిల్లీలో భాజపాలో చేరిన గరికపాటి.. అధికారికంగా భాజపా కండువాను ఆదివారం సభలో కప్పుకోనున్నారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ దేవేందర్‌గౌడ్‌ను పార్టీలోకి ఆహ్వానించనున్నట్లు సమాచారం. తెదేపా నేతలు ఎల్‌.దీపక్‌రెడ్డి, శోభారాణితో పాటు మాజీ మంత్రి జగన్నాయక్‌, మాజీ ఎమ్మెల్యేలు ఎర్ర శేఖర్‌, టి.నందీశ్వర్‌గౌడ్‌, ఊకె అబ్బయ్య కాషాయగూటికి చేరనున్నారు. కాంగ్రెస్‌ నేతలతోనూ కమలనాథులు కొంతకాలంగా చర్చలు జరుపుతున్నారు. మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనరసింహతో పార్టీ ముఖ్యనేతలు మాట్లాడగా.. ఆయన నెలరోజులు సమయం కావాలని చెప్పినట్లు తెలిసింది. కాంగ్రెస్‌ నేత, సినీనటి విజయశాంతితో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. మాజీ మంత్రి చంద్రశేఖర్‌తో భాజపా నేతలు మాట్లాడారు.

కమలం గూటికి ఆదినారాయణరెడ్డి!
ఏపీకి చెందిన మాజీ మంత్రి, కడప జిల్లా.. జమ్మలమడుగు నేత ఆదినారాయణరెడ్డి భాజపాలో చేరేందుకు సంసిద్ధత తెలిపినట్లు సమాచారం. ఆయన ఆ పార్టీ జాతీయ కమిటీలో కీలకస్థానంలో ఉన్న ఏపీ నేతతో కొద్దిరోజులుగా మంతనాలు జరుపుతున్నట్లు తెలిసింది.

రాజకీయం

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.