close
మైనారిటీ సంక్షేమ కమిటీ సభ్యులుగా బండి సంజయ్‌, రంజిత్‌రెడ్డి

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: తెలంగాణ రాష్ట్రస్థాయి మైనారిటీ సంక్షేమ కమిటీ సభ్యులుగా కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌కుమార్‌(భాజపా), చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్‌రెడ్డి(తెరాస) నియమితులయ్యారు. కేంద్ర మైనారిటీ వ్యవహారాలశాఖ మంత్రి ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ ఆదేశాల మేరకు ఈ నియామకాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర మైనారిటీ సంక్షేమశాఖ కార్యదర్శి మహేశ్‌దత్‌ ఎక్కా ఉత్తర్వులు జారీ చేశారు. ప్రధానమంత్రి జనవికాస్‌ పథకం కింద మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 15 ప్రధాన కార్యక్రమాల్లో భాగంగా మైనారిటీల సంక్షేమానికి వివిధ ప్రాజెక్టులను ప్రతిపాదించడం, అమలు చేయడం ఈ కమిటీ బాధ్యత. మైనారిటీలకు సంబంధించిన ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి, పకడ్బందీగా అమలు పరిచేలా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా బండి సంజయ్‌, రంజిత్‌రెడ్డిలు వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు.

రాజకీయం

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.