close
ఎమ్మెల్సీగా గుత్తా సుఖేందర్‌రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక

ఈనాడు, హైదరాబాద్‌: శాసనసభ్యుల కోటాలో ఎమ్మెల్సీగా గుత్తా సుఖేందర్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ స్థానానికి ఆయన ఒక్కరే బరిలో ఉండటంతో ఆయన ఏకగ్రీవంగా విజయం సాధించారు. ఎన్నికల రిటర్నింగు అధికారి, శాసనసభ కార్యదర్శి నర్సింహాచార్యులు ఆయనకు ధ్రువీకరణపత్రాన్ని అందజేశారు. మంత్రులు జగదీష్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, ఎంపీ లింగయ్య యాదవ్‌, శాసనసభ్యులు, మండలి సభ్యులు ఆయనకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా గుత్తా మాట్లాడుతూ, ‘మూడుసార్లు ఎంపీగా గెలిచిన నేను కేసీఆర్‌ ఇచ్చిన అవకాశంతో ఎమ్మెల్సీని అయ్యాను. దీన్ని గురుతర బాధ్యతగా భావిస్తా. ప్రజాసేవకే నా పదవిని వినియోగిస్తాను’ అని తెలిపారు.

శాసనమండలిలో పెరిగిన తెరాస బలం
గుత్తా ఎంపికతో శాసనమండలిలో తెరాస బలం మరింత పెరిగింది. మొత్తం 40 స్థానాలకు గాను 38 భర్తీ అయ్యాయి. గవర్నర్‌ కోటా, నిజామాబాద్‌ స్థానిక సంస్థల స్థానం ఖాళీగా ఉన్నాయి. మొత్తం 38 స్థానాలకు గాను 31 తెరాస, మజ్లిస్‌, పీఆర్‌టీయూ నుంచి ఇద్దరు చొప్పున, భాజపా, కాంగ్రెస్‌, యూటీఎఫ్‌ల నుంచి ఒక్కొక్కరు ఉన్నారు. ఇందులో పీఆర్‌టీయూ తెరాసకు అనుకూలం కాగా, మజ్లిస్‌ మిత్రపక్షంగా ఉంది.

రాజకీయం

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.