Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 176577
            [news_title_telugu_html] => 

భాజపాలోకి దేవేందర్‌గౌడ్‌?

[news_title_telugu] => భాజపాలోకి దేవేందర్‌గౌడ్‌? [news_title_english] => [news_short_description] => ఇతర పార్టీల నేతలను చేర్చుకునేందుకు భాజపా సంప్రదింపులు ముమ్మరం చేసింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ సోమవారం రాత్రి హైదరాబాద్‌లో దేవేందర్‌గౌడ్‌ ఇంటికెళ్లి సమావేశమయ్యారు. దేవేందర్‌తోపాటు ఆయన కుమారుడు [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => | [news_videoinfo] => | [news_sections] => ,24,23, ) )
భాజపాలోకి దేవేందర్‌గౌడ్‌? - EENADU
close
భాజపాలోకి దేవేందర్‌గౌడ్‌?

లక్ష్మణ్‌ సంప్రదింపులు
సామాజిక న్యాయం సదస్సు కోసం నేడు దిల్లీకి తెదేపా నేత
అగ్ర నేతల్ని కలిసే అవకాశం
తిరిగొచ్చిన తర్వాత నిర్ణయం తీసుకుంటాం: వీరేందర్‌గౌడ్‌
ఇతర పార్టీల నేతలతో భాజపా సంప్రదింపులు ముమ్మరం
ఈనాడు - హైదరాబాద్‌

ఇతర పార్టీల నేతలను చేర్చుకునేందుకు భాజపా సంప్రదింపులు ముమ్మరం చేసింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ సోమవారం రాత్రి హైదరాబాద్‌లో దేవేందర్‌గౌడ్‌ ఇంటికెళ్లి సమావేశమయ్యారు. దేవేందర్‌తోపాటు ఆయన కుమారుడు వీరేందర్‌గౌడ్‌ను పార్టీలోకి లక్ష్మణ్‌ ఆహ్వానించగా వారు సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. వీరేందర్‌గౌడ్‌ ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఉప్పల్‌ నుంచి తెదేపా అభ్యర్థిగా పోటీచేసిన విషయం తెలిసిందే. వారు పార్టీలో చేరడం దాదాపు ఖాయమేనని.. మూడు, నాలుగు రోజుల్లో స్పష్టత వస్తుందని భాజపా నేత ఒకరు పేర్కొన్నారు.

రాష్ట్రపతి, ప్రధానితో సమావేశం?
దేవేందర్‌గౌడ్‌, వీరేందర్‌గౌడ్‌ బుధవారం దిల్లీకి వెళ్తున్నారు. ‘సామాజిక న్యాయం’పై దిల్లీలోని కాన్‌స్టిట్యూషన్‌ క్లబ్‌లో నిర్వహించే సదస్సులో పాల్గొంటారు. తర్వాత రాష్ట్రపతి కోవింద్‌తోపాటు ప్రధాని మోదీని కలిసి వినతిపత్రం ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. అదే సమయంలో భాజపా అగ్రనేతల్ని దేవేందర్‌గౌడ్‌ కలిసే అవకాశమున్నట్లు ఆ పార్టీ నేతల సమాచారం. లోక్‌సభ ఎన్నికల సమయం నుంచే దేవేందర్‌గౌడ్‌తో కమలనాథులు టచ్‌లో ఉన్నారు. ఎమ్మెల్సీ రామచందర్‌రావు ఆయన ఇంటికెళ్లి మద్దతు కోరారు. భాజపాలోకి రావాలని దేవేందర్‌గౌడ్‌ను రాజ్యసభ సభ్యుడు గరికపాటి మోహన్‌రావు కొద్దిరోజుల క్రితం వెళ్లి ఆహ్వానించారు. తాజాగా లక్ష్మణ్‌ కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ విషయంపై ‘ఈనాడు’ వీరేందర్‌గౌడ్‌ను సంప్రదించగా..లక్ష్మణ్‌ కలిసిన విషయం వాస్తవమేనని, భాజపాలో చేరే విషయం దిల్లీ నుంచి వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

కాంగ్రెస్‌ నేతలపై దృష్టి
తెదేపా నేతల్ని పెద్దసంఖ్యలో చేర్చుకున్న భాజపా..కాంగ్రెస్‌తోపాట కొందరు తెరాస నేతలపై దృష్టి సారించింది. ఇతర పార్టీల్లో అసంతృప్తుల్ని ఆకర్షించే బాధ్యత జాతీయ నాయకత్వం రాష్ట్రస్థాయిలో లక్ష్మణ్‌, కిషన్‌రెడ్డి, దత్తాత్రేయలకు అప్పగించినట్లు తెలిసింది. ఓ జాబితా రూపొందించి ఒక్కొక్కరిని సంప్రదిస్తున్నారు. మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహతో లక్ష్మణ్‌ ఇప్పటికే ఓసారి మాట్లాడగా ఆయన కొంత సమయం అడిగినట్లు తెలిసింది. మాజీ ఎంపీ విజయశాంతితో కిషన్‌రెడ్డి మాట్లాడుతున్నారు. చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డితో రాంమాధవ్‌ గతంలోనే సమావేశంకాగా కొంతకాలం తర్వాత నిర్ణయం తీసుకుంటానని చెప్పినట్లు సమాచారం. మాజీమంత్రి చంద్రశేఖర్‌తోపాటు ఉత్తర తెలంగాణలో ఇద్దరు మాజీ ఎమ్మెల్సీలు, పలువురు మాజీ ఎమ్మెల్యేలతో భాజపా నేతలు చర్చలు జరుపుతున్నారు. తెరాసలో రిజర్వుడ్‌ నియోజకవర్గాలకు చెందిన ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలనూ సంప్రదిస్తున్నట్లు తెలిసింది.


కమలం కొత్త దళం 12 లక్షలు!

ఈనాడు, హైదరాబాద్‌: భాజపాలో కొత్త సభ్యత్వాల నమోదు కార్యక్రమం మంగళవారంతో ముగిసింది. 19వ తేదీ వరకు తెలంగాణవ్యాప్తంగా కొత్త సభ్యత్వాల సంఖ్య 12 లక్షలకు చేరినట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. లోక్‌సభ నియోజకవర్గాలవారీగా.. ఒక్కోటి లక్షకుపైగా సభ్యత్వాలతో కరీంనగర్‌, ఆదిలాబాద్‌ తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. తర్వాత స్థానాల్లో నిజామాబాద్‌, మహబూబ్‌నగర్‌ ఉండగా..ఖమ్మం, మహబూబాబాద్‌ చివరి స్థానాల్లో నిలిచాయి. తెలంగాణపై ప్రత్యేక దృష్టిపెట్టిన ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా రాష్ట్ర పార్టీ నిర్ణయించిన 12 లక్షల కొత్త సభ్యత్వాల లక్ష్యాన్ని 18 లక్షలకు పెంచారు. ఆగస్టు 20తో సభ్యత్వ నమోదు పూర్తికావడంతో 21-30వరకు క్రియాశీల సభ్యత్వ నమోదు నిర్వహించాలని భాజపా నిర్ణయించింది.

హైదరాబాద్‌లో 50శాతమే
సభ్యత్వ నమోదులో హైదరాబాద్‌పై కమలదళం ఎక్కువ ఆశలు పెట్టుకుంది. 4 లక్షల సభ్యత్వాలు చేయించాలనుకోగా.. సభ్యత్వాలు 50శాతంలోపే ఉన్నట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా చూస్తే 12లక్షల వరకే చేరుకుంది. ‘‘ఆఖరిరోజు సభ్యత్వాలు, పేపర్‌ ద్వారా చేసే సభ్యత్వాలు కలిపితే 15లక్షల వరకు చేరే అవకాశముంది. ఏ ఇంటికెళ్లినా భాజపా సభ్యత్వం తీసుకునేందుకు ముందుకొచ్చారు. మేమే అందరి వద్దకు చేరుకోలేకపోయాం’’ అని పార్టీ రాష్ట్ర సభ్యత్వ నమోదు సహ ఇంఛార్జి కాసంవెంకటేశ్వర్లు ‘ఈనాడు’తో చెప్పారు.

రాజకీయం

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.