Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 176584
            [news_title_telugu_html] => 

తెరాసనే అబద్ధాల పుట్ట

[news_title_telugu] => తెరాసనే అబద్ధాల పుట్ట [news_title_english] => [news_short_description] => తెరాసనే అబద్ధాల పుట్ట అని భాజపా జాతీయ కార్యవర్గ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ విమర్శించారు. భాజపా కార్యనిర్వాహక అధ్యక్షుడు నడ్డాపై చేసిన విమర్శలకు స్పందనగా కేటీఆర్‌కు దత్తాత్రేయ [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [news_sections] => ,24,23, ) )
తెరాసనే అబద్ధాల పుట్ట - EENADU
close
తెరాసనే అబద్ధాల పుట్ట

కేంద్ర మాజీ మంత్రి దత్తాత్రేయ

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: తెరాసనే అబద్ధాల పుట్ట అని భాజపా జాతీయ కార్యవర్గ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ విమర్శించారు. భాజపా కార్యనిర్వాహక అధ్యక్షుడు నడ్డాపై చేసిన విమర్శలకు స్పందనగా కేటీఆర్‌కు దత్తాత్రేయ మంగళవారం బహిరంగ లేఖ రాశారు. ఎన్నికల్లో అనేక హామీలిచ్చి.. ఒక్కటీ నెరవేర్చకుండా అబద్ధాలకు మారుపేరుగా మారింది మీ పార్టీ, ప్రభుత్వం కాదా? అని ప్రశ్నించారు. భాజపా కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎవరో తెలియని మీ రాజకీయ అజ్ఞానానికి ధన్యవాదాలని లేఖలో పేర్కొన్నారు. ‘‘2016లో తెలంగాణకు ఎయిమ్స్‌ కావాలని, కేంద్ర ఫార్మా ప్రాజెక్టుల్లో రాష్ట్రానికి ప్రాధాన్యం ఇవ్వాలని నాడు నువ్వు (కేటీఆర్‌) కలిసిన కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా.. ఈయన ఒక్కరే’’ అని తెలిపారు. నియంతృత్వంతో కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయాన్ని రూ.35వేల కోట్లకు పెంచింది నిజం కాదా? గొర్రెల పంపిణీ పథకంలో అవినీతిపై మీ కలెక్టర్లే విచారణ చేయించడం వాస్తవం కాదా? హైదరాబాద్‌ను డల్లాస్‌గా మారుస్తామని చెప్పి మాట మార్చింది ముఖ్యమంత్రి కేసీఆర్‌ కాదా? అని లేఖలో దత్తాత్రేయ ప్రశ్నించారు.

కేసీఆర్‌ను దించేందుకు పోరాటం: సంజయ్‌
కేసీఆర్‌ను గద్దె దించేందుకు మరో తెలంగాణ విమోచన పోరాటం చేస్తామని భాజపా ఎంపీ బండి సంజయ్‌ అన్నారు. మిషన్‌ కాకతీయ, భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టుల్లో జరిగిన అవినీతిపై ఆధారాలున్నాయని, త్వరలోనే వాటిని బహిర్గతం చేస్తామన్నారు. కేసీఆర్‌ కుటుంబ అవినీతిపై సామాన్య ప్రజల్లో చర్చ జరుగుతుంటే ప్రగతిభవన్‌, ముఖ్యమంత్రి ఫాంహౌస్‌లో అసహనం పెరిగిపోతోందని విమర్శించారు. ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకత తెరాస పతనానికి సంకేతమని సంజయ్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

రాజకీయం

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.