Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 176589
            [news_title_telugu_html] => 

శాంతి స్థాపనకు రాజీవ్‌ పరితపించారు

[news_title_telugu] => శాంతి స్థాపనకు రాజీవ్‌ పరితపించారు [news_title_english] => [news_short_description] => దేశంలో శాంతి స్థాపనకు రాజీవ్‌గాంధీ పరితపించారని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్‌ చౌహాన్‌ అన్నారు. దేశ స్వాతంత్య్ర సముపార్జనకు, దేశాభివృద్ధికి గాంధీ, నెహ్రూ కుటుంబాలు చేసిన ప్రాణ త్యాగాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కాంగ్రెస్‌ శ్రేణులకు పిలుపునిచ్చారు. టీపీసీసీ ఆధ్వర్యంలో భారతరత్న, దివంగత మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ 75వ జయంతి వేడుకలు మంగళవారం గాంధీభవన్‌లోని ప్రకాశంహాలులో నిర్వహించారు... [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 1 [news_videolink] => |https://www.youtube.com/embed/70Ry57LEjmA [news_videoinfo] => |https://www.youtube.com/embed/70Ry57LEjmA [news_sections] => ,24,23, ) )
శాంతి స్థాపనకు రాజీవ్‌ పరితపించారు - EENADU
close
శాంతి స్థాపనకు రాజీవ్‌ పరితపించారు

మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్‌ చౌహాన్‌
గాంధీభవన్‌లో రాజీవ్‌ 75వ జయంతి వేడుకలు

హైదరాబాద్‌, సోమాజిగూడ, న్యూస్‌టుడే: దేశంలో శాంతి స్థాపనకు రాజీవ్‌గాంధీ పరితపించారని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్‌ చౌహాన్‌ అన్నారు. దేశ స్వాతంత్య్ర సముపార్జనకు, దేశాభివృద్ధికి గాంధీ, నెహ్రూ కుటుంబాలు చేసిన ప్రాణ త్యాగాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కాంగ్రెస్‌ శ్రేణులకు పిలుపునిచ్చారు. టీపీసీసీ ఆధ్వర్యంలో భారతరత్న, దివంగత మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ 75వ జయంతి వేడుకలు మంగళవారం గాంధీభవన్‌లోని ప్రకాశంహాలులో నిర్వహించారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మాజీ గవర్నర్‌ రోశయ్య, మహారాష్ట్ర మాజీ సీఎం పృథ్వీరాజ్‌ చౌహాన్‌, పీసీసీ మాజీ అధ్యక్షులు వీహెచ్‌, పొన్నాల, మాజీ మంత్రులు జానారెడ్డి, దామోదర రాజనర్సింహ, షబ్బీర్‌అలీ, డీకే సమరసింహారెడ్డి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, జగ్గారెడ్డి, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు కుసుమకుమార్‌, పొన్నం ప్రభాకర్‌, ఏఐసీసీ కార్యదర్శులు సంపత్‌కుమార్‌, సలీం అహ్మద్‌, మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్‌, సీనియర్‌ పాత్రికేయులు రామచంద్రమూర్తి హాజరయ్యారు.

చౌహాన్‌ మాట్లాడుతూ చిన్న వయస్సులో ప్రధాని బాధ్యతలు చేపట్టిన రాజీవ్‌గాంధీ భాషాభివృద్ధికి ప్రత్యేక విభాగం ఏర్పాటు చేశారన్నారు. ఆంగ్ల భాషా పరిజ్ఞానం పెంపొందించేందుకు కంప్యూటర్‌, ఐటీ రంగంలో నవ యుగానికి నాంది పలికారన్నారు. శ్రీలంకలో శాంతి స్థాపన కోసం ప్రయత్నించారని.. దీనిని జీర్ణించుకోలేకే ఎల్‌టీటీఈ ఉగ్రవాదులు రాజీవ్‌ను హత్య చేశారని గుర్తు చేశారు. రోశయ్య మాట్లాడుతూ గాంధీ, నెహ్రూ కుటుంబాలు దేశం కోసం ఎంతో చేశాయని.. దాన్ని జీర్ణించుకోలేక ప్రజల మనసుల్లోంచి వారిని తుడిపేసేందుకే భాజపా తప్పుడు విమర్శలు చేస్తోందని వ్యాఖ్యానించారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రసంగిస్తూ నాటి పరిస్థితుల దృష్ట్యా కశ్మీర్‌లో నెహ్రూ ఆర్టికల్‌ 370 తీసుకొచ్చారని, దానిపై అమిత్‌షా, భాజపా తప్పుడు విమర్శలు చేయడం బాధాకరమన్నారు.  మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్‌ మాట్లాడుతూ నాడు నెహ్రూ ఆర్టికల్‌ 370 తీసుకురాకపోతే 1948లోనే కశ్మీర్‌.. పాక్‌లో కలిసిపోయేదన్నారు. భాజపా తప్పుడు ప్రచారాన్ని కాంగ్రెస్‌ సమర్థంగా తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఆర్థిక సంస్కరణలకు బీజం వేసింది, గ్రామ స్వరాజ్యానికి పునాది వేసింది రాజీవ్‌ అని సీనియర్‌ పాత్రికేయులు రామచంద్రమూర్తి పేర్కొన్నారు. యువజన కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఉత్తమ్‌, భట్టివిక్రమార్క ప్రారంభించారు.

 

సోమాజిగూడలో..
సోమాజిగూడలో పార్టీ సీనియర్‌ నేత వి.హనుమంతరావు ఆధ్వర్యంలో రాజీవ్‌ జయంత్యుత్సవాలు నిర్వహించారు. పార్టీ నేతలు జానారెడ్డి, శ్రీధర్‌బాబు, భట్టి విక్రమార్క, మర్రి శశిధర్‌రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, పొన్నం ప్రభాకర్‌, మల్లు రవి, షబ్బీర్‌అలీ రాజీవ్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ మాట్లాడుతూ దేశాన్ని అభివృద్ధిపథంలో నడిపిన నెహ్రూ కుటుంబంపై పలువురు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు.

చరవాణి సరే.. జనవాణీ వినాలి


మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ జయంతి పురస్కరించుకొని హైదరాబాద్‌లో ‘సద్భావన పరుగు’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో వేదికపై ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, పొన్నం ప్రభాకర్‌ ఇలా చరవాణిలో సందేశాలు చూస్తూ నిమగ్నమైపోయారు. వీరిని జానారెడ్డి ఆసక్తిగా తిలకించారు.

- ఈనాడు, హైదరాబాద్‌

 

రాజకీయం

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.