Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 179041
            [news_title_telugu_html] => 

డిసెంబరు 17న లక్ష మందితో చలో దిల్లీ

[news_title_telugu] => డిసెంబరు 17న లక్ష మందితో చలో దిల్లీ [news_title_english] => [news_short_description] => కేంద్రం మెడలువంచైనా ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని సాధించుకోవాల్సిన తరుణం ఆసన్నమైందని మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ వెల్లడించారు. భద్రాచలంలో 22, 23 తేదీల్లో జాతీయ కార్యవర్గ సమావేశాలను నిర్వహించి [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [news_sections] => ,24,23, ) )
డిసెంబరు 17న లక్ష మందితో చలో దిల్లీ - EENADU
close
డిసెంబరు 17న లక్ష మందితో చలో దిల్లీ

  తెలుగు రాష్ట్రాల్లో సమాయత్త సదస్సులు
  ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ వెల్లడి

భద్రాచలం, న్యూస్‌టుడే: కేంద్రం మెడలువంచైనా ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని సాధించుకోవాల్సిన తరుణం ఆసన్నమైందని మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ వెల్లడించారు. భద్రాచలంలో 22, 23 తేదీల్లో జాతీయ కార్యవర్గ సమావేశాలను నిర్వహించి పలు కీలక తీర్మానాలు చేశారు. వీటిని శనివారం విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టాలన్న ప్రధాన డిమాండ్‌తో డిసెంబరు 17న లక్ష మంది ఎమ్మార్పీఎస్‌ కార్యకర్తలతో చలో దిల్లీ చేపట్టనున్నట్లు ప్రకటించారు. దీన్ని విజయవంతం చేసేందుకు వచ్చే నెల 1 నుంచి 17 వరకు వరంగల్‌లో జాతీయ స్థాయి సదస్సు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. తెలంగాణలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో సెప్టెంబరు 23 నుంచి అక్టోబరు 31 వరకు, ఆంధ్రప్రదేశ్‌లోని 150 చోట్ల నవంబరు 1 నుంచి డిసెంబరు 14 వరకు సమాయత్త సమావేశాలు ఉంటాయని చెప్పారు.  ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అఖిల పక్షాలతో దిల్లీకి వచ్చి కేంద్రంతో మాట్లాడితే సులువుగా వర్గీకరణ చట్టం వస్తుందని విశ్లేషించారు. సమావేశంలో ఎమ్మార్పీఎస్‌ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు రాగాటి సత్యం, తెలంగాణ అధ్యక్షుడు రమేశ్‌కుమార్‌, ఆంధ్రప్రదేశ్‌ అధ్యక్షుడు బ్రహ్మయ్య, మహారాష్ట్ర అధ్యక్షుడు అజిత్‌ కసలైకర్‌ తదితరులు పాల్గొన్నారు.

రాజకీయం

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.