Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 179046
            [news_title_telugu_html] => 

ప్రధాని ప్రశంసలు.. వారు విమర్శలు

[news_title_telugu] => ప్రధాని ప్రశంసలు.. వారు విమర్శలు [news_title_english] => [news_short_description] => తెలంగాణ ప్రభుత్వ పథకాలను, కార్యక్రమాలను స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసిస్తుంటే.. ఇక్కడి భాజపా నేతలు విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ ధ్వజమెత్తారు. భాజపా రాష్ట్రాధ్యక్షుడు లక్ష్మణ్‌ రోజూ సీఎం కేసీఆర్‌ను, రాష్ట్ర ప్రభుత్వాన్ని, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ను దూషిస్తూ.. బలం పెరుగుతోందనే భ్రమలో ఉన్నారన్నారు. శనివారం తెలంగాణ శాసనసభాపక్ష కార్యాలయంలో మంత్రి విలేకరులతో [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 1 [news_videolink] => |https://www.youtube.com/embed/f9i5Inl7J6o [news_videoinfo] => |https://www.youtube.com/embed/f9i5Inl7J6o [news_sections] => ,24,23, ) )
ప్రధాని ప్రశంసలు.. వారు విమర్శలు - EENADU
close
ప్రధాని ప్రశంసలు.. వారు విమర్శలు

  రాష్ట్ర భాజపా నేతలపై  మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ధ్వజం

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వ పథకాలను, కార్యక్రమాలను స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసిస్తుంటే.. ఇక్కడి భాజపా నేతలు విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ ధ్వజమెత్తారు. భాజపా రాష్ట్రాధ్యక్షుడు లక్ష్మణ్‌ రోజూ సీఎం కేసీఆర్‌ను, రాష్ట్ర ప్రభుత్వాన్ని, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ను దూషిస్తూ.. బలం పెరుగుతోందనే భ్రమలో ఉన్నారన్నారు. శనివారం తెలంగాణ శాసనసభాపక్ష కార్యాలయంలో మంత్రి విలేకరులతో మాట్లాడారు. ‘‘మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ వంటి పథకాలను ప్రధాని మెచ్చుకున్నారు. మన్‌ కీ బాత్‌ కార్యక్రమంలోనూ చెప్పారు. కేంద్రమంత్రులు, ఉన్నతాధికారులు అభినందనలు తెలిపారు. నీటివనరుల పునరుద్ధరణలో తెలంగాణ దేశంలో అగ్రస్థానంలో నిలిచిందని నీతి ఆయోగ్‌ తాజా నివేదికలో పేర్కొంది. లక్ష్మణ్‌, తెలంగాణ భాజపా నేతలు మాత్రం అవినీతి జరిగిందని ఆరోపణలు చేయడం దారుణం. విద్యుత్‌ కొనుగోళ్లపై సీబీఐ విచారణకు సిద్ధమని అధికారులే తేల్చి చెబుతుంటే.. భాజపా నేతలు మాత్రం అధికారులను బెదిరించే రీతిలో మాట్లాడుతున్నారు. సభ్యత్వ నమోదులో మిస్‌డ్‌ కాల్స్‌ పేరిట భాజపా నాటకాలు వేస్తోంది. తెరాస మిస్‌డ్‌ కాల్స్‌ పంథాలో వెళితే మూడున్నర కోట్ల మంది నమోదవుతారు. మత రాజకీయాలు ఉత్తర భారతదేశంలో నడుస్తాయేమో కానీ.. దక్షిణ భారతంలో కాదు. ఇక్కడ కేసీఆర్‌ సెంటిమెంట్‌ మాత్రమే నడుస్తోంది.’’ అని శ్రీనివాస్‌గౌడ్‌ కోరారు.

 

రాజకీయం

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.