Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 179623
            [news_title_telugu_html] => 

కశ్మీర్‌పై మోదీ, షా కొత్తగా చేసిందేం లేదు

[news_title_telugu] => కశ్మీర్‌పై మోదీ, షా కొత్తగా చేసిందేం లేదు [news_title_english] => [news_short_description] => దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలోనే జమ్మూ-కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమైందని, భాజపా నాయకులు మాత్రం ప్రధాని మోదీ, అమిత్‌షాలు ఇప్పుడే కశ్మీర్‌ను దేశంలో కలిపేసినట్లుగా ప్రచారం చేస్తున్నారని సీపీఐ ప్రధాన [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [news_sections] => ,24,23,22, ) )
కశ్మీర్‌పై మోదీ, షా కొత్తగా చేసిందేం లేదు - EENADU
close
కశ్మీర్‌పై మోదీ, షా కొత్తగా చేసిందేం లేదు

  సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలోనే జమ్మూ-కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమైందని, భాజపా నాయకులు మాత్రం ప్రధాని మోదీ, అమిత్‌షాలు ఇప్పుడే కశ్మీర్‌ను దేశంలో కలిపేసినట్లుగా ప్రచారం చేస్తున్నారని సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా విమర్శించారు. కశ్మీర్‌ విషయంలో మోదీ, షా కొత్తగా చేసిందేమీ లేదన్న విషయాన్ని ప్రజలు గుర్తించాలన్నారు. సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించాక తొలిసారి ఆదివారం ఆయన తెలంగాణకు వచ్చారు. ఈ సందర్భంగా ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఇంద్రజిత్‌గుప్తా శతజయంతి ఉత్సవాల్లో భాగంగా ‘ఆర్టికల్‌ 370 రద్దు- కశ్మీర్‌ పరిణామాలు’ అనే అంశంపై నిర్వహించిన సదస్సులో రాజా మాట్లాడారు. ఆర్టికల్‌ 370ని అనుసరించి కశ్మీర్‌కు ఇచ్చిన హామీల అమలుపై మాట్లాడేందుకు మోదీ సిద్ధంగా లేరన్నారు. జమ్మూ-కశ్మీర్‌లో కర్ఫ్యూతో నేటికీ అక్కడి ప్రజలు పాఠశాలలకు, ఆసుపత్రులకు వెళ్లలేని దుస్థితి కొనసాగుతోందన్నారు. ఆర్టికల్‌ 370కి వల్లభ్‌భాయ్‌పటేల్‌ ఒప్పుకోలేదని చెప్పడంలో వాస్తవం లేదని, నెహ్రూ, పటేల్‌ తదితర నాయకులంతా కలిసే కశ్మీర్‌కు ప్రత్యేక హోదా ఇచ్చిన విషయాన్ని గుర్తించాలన్నారు.  అఖండ భారత్‌, దేశమంతా ఒక్కటే పేరుతో భారత్‌ను హిందూ రాజ్యంగా మార్చేందుకు భాజపా కుట్రలు చేస్తోందని రాజా ఆరోపించారు. స్వాతంత్య్రం కోసం బ్రిటిష్‌ వారితో పోరాడిన స్ఫూర్తితో భాజపా, ఆర్‌ఎస్‌ఎస్‌లకు వ్యతిరేకంగా పోరాటాలు చేసి దేశాన్ని, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటామన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, నాయకులు పల్లా వెంకట్‌రెడ్డి, అజీజ్‌పాషా, పశ్య పద్మ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం.. అనారోగ్యంతో బాధపడుతోన్న సీపీఐ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డిని ఆయన నివాసంలో రాజా పరామర్శించారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

రాజకీయం

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.