close
హరియాణాలో నువ్వా-నేనా!

భాజపా, కాంగ్రెస్‌ మధ్య హోరాహోరీ
ఇండియా టుడే ఎగ్జిట్‌ పోల్‌

దిల్లీ: హరియాణాలో శాసనసభా సమరంలో భాజపా గెలిచేందుకే స్పష్టమైన అవకాశాలున్నాయని వేర్వేరు సంస్థల ఎగ్జిట్‌పోల్స్‌ చెబుతుంటే ‘‘ఇండియా టుడే- యాక్సిస్‌ మై ఇండియా’’ మాత్రం... గెలుపు ఎవరినైనా వరించవచ్చని అంచనా వేస్తోంది. భాజపా-కాంగ్రెస్‌ మధ్య నువ్వా-నేనా అన్నట్లుగా పోరు సాగిందని, అందువల్ల ఏ పక్షమైనా గద్దెనెక్కవచ్చని చెబుతోంది. 90 స్థానాలున్న శాసనసభలో భాజపా 32-44 సీట్లను పొందవచ్చని లెక్కవేసింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 46 స్థానాలు అవసరం. గత ఎన్నికల్లో భాజపా 47 నియోజకవర్గాల్లో గెలిచి, అధికారం కైవసం చేసుకొంది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌కి 15 సీట్లు రాగా ఈసారి 30-42 మధ్య రావచ్చని ఈ ఎగ్జిట్‌పోల్‌ అంచనా. దుశ్యంత్‌ చౌతాలా నేతృత్వంలోని జననాయక్‌ జనతా పార్టీకి 6-10, ఇతరులకు మరో 6-10 స్థానాలు దక్కవచ్చని తెలిపింది.

రాజకీయం

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.