close
జేఈఈ (మెయిన్‌) నిర్వహణలో వివక్ష: మమత

కోల్‌కతా: జాతీయస్థాయి సాంకేతిక విద్యా సంస్థల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన ‘జేఈఈ (మెయిన్‌)’ పరీక్షను ప్రాంతీయ భాషల్లో నిర్వహించే విషయంలో కేంద్రం వివక్ష చూపుతోందని పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ విమర్శించారు. ఆంగ్లంతో పాటు గుజరాతీ భాషలో మాత్రమే పరీక్షను పెట్టడ[మేంటని ప్రశ్నించారు. అన్ని స్థానిక భాషల్లోనూ ఈ పరీక్షను నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ 11న రాష్ట్ర వ్యాప్తంగా నిరసన వ్యక్తం చేస్తామన్నారు. తమ మాదిరే ఇతర రాష్ట్రాలూ ఆందోళన వ్యక్తం చేయాలన్నారు.

రాజకీయం

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.