
ఈనాడు, హైదరాబాద్: ఖరీఫ్ సీజన్లో పండించిన పంటలకు కేంద్రం నిర్ణయించిన మద్దతు ధరలను అమలు చేయాలని సీపీఎం రాష్ట్ర కమిటీ కోరింది. చెరుపల్లి సీతారాములు అధ్యక్షతన బుధవారం ఇక్కడ జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశం ఈ మేరకు తీర్మానం చేసింది. మార్కెట్లలో మద్దతు ధరలు అమలు కావడంలేదని పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు.వరంగల్ ఎనుమాముల మార్కెట్లో మంగళవారం వరకూ సుమారు 3 లక్షల క్వింటాల పత్తి వస్తే సీసీఐ కేవలం 400 క్వింటాలు మాత్రమే కొనుగోలు చేసిందని చెప్పారు. తూకాల్లోనూ మోసాలను తక్షణమే అరికట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
రాజకీయం
జిల్లా వార్తలు
దేవతార్చన

- ఓ ఇంటివాడైన సాయిప్రణీత్
- వదిలేశారు..
- శ్వేతసౌధంలో ఏకాకి!
- ‘నేను చనిపోతున్నా.. నా ఫ్యామిలీ జాగ్రత్త’
- ఎన్కౌంటర్పై అనుమానాలున్నాయా?
- వరుడు ఆలస్యం.. పెళ్లి రద్దు చేసిన వధువు!
- బాలికపై అత్యాచారానికి తల్లి సహకారం
- గుర్రమెక్కుతుంటే బాదేశారు... తాళి కడుతుంటే ఆపేశారు!
- ఉసురు తీశాడు.. ఉరిపోసుకున్నాడు
- సైబరాబాద్ పోలీస్ వాట్సప్ నిలిపివేత