
ప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నాల్లో కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన
ముంబయి, దిల్లీ: మహారాష్ట్రలో చర్చల పర్వం కొనసాగుతోంది. ప్రభుత్వ ఏర్పాటు కోసం కనీస ఉమ్మడి కార్యక్రమాన్ని(సీఎంపీ) రూపొందించే ప్రయత్నాలను కాంగ్రెస్-ఎన్సీపీ ముమ్మరం చేశాయి. శివసేన మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకుగాను ఆ పార్టీలు సంయుక్త కమిటీ ద్వారా సీఎంపీని తయారుచేస్తున్నాయి. చర్చల కోసం మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు బాలాసాహెబ్ థొరాట్, ఆ పార్టీ సీనియర్ నేతలు అశోక్ చవాన్, మాణిక్రావ్లతో శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే బుధవారం సమావేశమయ్యారు. అనంతరం ఠాక్రే విలేకర్లతో మాట్లాడుతూ.. ప్రభుత్వ ఏర్పాటుపై తమ చర్చలు సరైన దిశలో సాగుతున్నాయన్నారు. ఠాక్రేతో సమావేశాన్ని సానుకూల ముందడుగుగా కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానించారు.
* సీఎంపీ ఖరారుపై కాంగ్రెస్-ఎన్సీపీ బుధవారం రాత్రి భేటీ కావాల్సి ఉన్నా, ఆ సమావేశం విషయంలో గందరగోళం నెలకొంది. తమ భేటీ రద్దయిందంటూ ఎన్సీపీ నేత అజిత్ పవార్ చెప్పగా.. మీడియా నుంచి తప్పించుకునేందుకే ఆయన అలా చెప్పారని, సమావేశం జరిగిందని శరద్ పవార్ పేర్కొనడం గమనార్హం.
* ఉప ముఖ్యమంత్రి, అసెంబ్లీ స్పీకర్ పదవులు కాంగ్రెస్కు దక్కేలా, సీఎం పదవిని శివసేన-ఎన్సీపీ పంచుకునేలా ఒప్పందం కుదుర్చుకొని మూడు పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయబోతున్నాయని జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఐదు రోజులుగా జైపుర్(రాజస్థాన్)లోని రిసార్టులో ఉన్న మహారాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బుధవారం ముంబయికి తిరిగొచ్చారు.
రాజకీయం
దేవతార్చన

- చెప్పేస్తుందేమోనని.. చంపేశారు
- 22 ఏళ్లకే ఐపీఎస్ అధికారి..!
- భారతా.. విండీసా.. వరుణుడా.. ఆరంభమెవరిదో?
- నలుదిశలా ఐటీ
- ఏమీ లేని స్థితిని చూసిన వాణ్ని
- తెలుగు రాష్ట్రాలు.. ఆసక్తికర చిత్రాలు
- షేవ్చేసుకోకుండా.. సేవ చేస్తారు
- యువతిపై అత్యాచారం.. ఆపై నిప్పు
- బాపట్లలో వింత శిశువు జననం
- ‘మా వస్తువులు మేమే డెలివరీ చేసుకుంటాం’