close
భాజపా కార్యకర్తలకు వైకాపా వేధింపులు

ఉప రాష్ట్రపతిపై ఏపీ సీఎం వ్యాఖ్యలను ఖండిస్తున్నా: కిషన్‌రెడ్డి

ఈనాడు, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కొందరిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నట్లు అర్థమవుతోందని, అది మంచి పద్ధతి కాదని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి హితవు పలికారు. వైకాపా కార్యకర్తలు తమను వేధిస్తున్నట్లు శ్రీకాకుళం, గుంటూరు, బాపట్ల ప్రాంతాల భాజపా కార్యకర్తలు ఫిర్యాదు చేస్తున్నారని వెల్లడించారు. పథకం ప్రకారం మతమార్పిడులు జరగడం సరికాదని, అన్యమత ప్రచారంపై తగిన సమయంలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఎప్పటికప్పుడు తమకు సమాచారం వస్తుందని గుర్తుచేశారు. బుధవారం విశాఖలోని భాజపా నగర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిపై ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.

వైకాపా పిచ్చి పరాకాష్టకు చేరింది: కన్నా
ఈనాడు డిజిటల్‌, అమరావతి: రాష్ట్రంలో వైకాపా పిచ్చి పరాకాష్టకు చేరిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. ‘‘బడినీ, గుడినీ వదలని వైకాపా వాళ్లు అవకాశముంటే ఇసుకకి, ఇంద్రధనస్సుకీ రంగులేసేలా ఉన్నారు. అన్నవరంలో అన్యమత ప్రచారం, భవానీ ఐలాండ్‌లో ఆర్చిపై బొమ్మల ఏర్పాటు, భీమిలి ఉత్సవ్‌లో మతపరమైన స్టాల్స్‌ ఏర్పాటు.. వైకాపా మత వ్యాప్తిని సూచిస్తున్నాయి’’ అని ట్వీట్‌ చేశారు. కొన్ని ఫొటోలను ఈ ట్వీట్‌కు జతచేశారు.

 

రాజకీయం

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.