close

ప్రధానాంశాలు

‘కోరేగావ్‌-భీమా తప్పుడు కేసుల’ ఉపసంహరణకు సిద్ధమే

మహారాష్ట్ర మంత్రి జయంత్‌పాటిల్‌ వెల్లడి

ముంబయి: కోరేగావ్‌-భీమా ఘటనలో కొందరిపై నమోదు చేసిన ‘తప్పుడు కేసులను’ ఉపసంహరించుకునేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం అనుకూలంగా ఉందని రాష్ట్ర మంత్రి జయంత్‌పాటిల్‌ తెలిపారు. ఈ కేసులో కొందరికి ప్రమేయం లేకపోయినా తప్పుడు కేసులు పెట్టినట్లు అనేకమంది విన్నవించుకున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ విషయంపై సానుకూలంగా ఉందన్నారు. సీఎం ఉద్ధవ్‌ఠాక్రే తుది నిర్ణయం తీసుకుంటారన్నారు. ఈ కేసులను ఎత్తివేయాలని చూడటాన్ని భాజపా తప్పు పట్టింది. ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని న్యాయస్థానం చెబుతుండగా కేసులు ఉపసంహరించాలనుకోవడం నక్సలిజానికి మద్దతు ఇవ్వడమేనని భాజపా అధికార ప్రతినిధి మాధవ్‌ భండారీ ఆరోపించారు. మరాఠా రిజర్వేషన్ల కోసం ఉద్యమించిన వారిపైనా, కోరేగావ్‌-భీమా ఉదంతానికి నిరసనగా ఆందోళన చేసిన దళితులపైనా నమోదైన కేసులను ఉపసంహరించాలని కోరుతూ ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ఠాక్రేకి కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి నసీమ్‌ఖాన్‌ లేఖ రాశారు.

రాజకీయం

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.