close

ప్రధానాంశాలు

ఏ రోజూ భాజపాకు దూరం కాలేదు

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌

ఈనాడు, తిరుపతి: ‘ప్రత్యేక హోదా అంశంపై భాజపాతో విభేదించానే తప్ప.. ఏ రోజూ దూరం కాలేదు. కేవలం ప్రత్యేక హోదా కోసమే దూరం కావాల్సి వచ్చింది. ప్రజల ప్రయోజనాల కోసం సమీకరణాలు మారుతుంటాయి. రెండో రాజధాని ఏర్పాటు అంశం అంబేడ్కర్‌ చెప్పింది తప్ప.. నేను సొంతంగా మాట్లాడింది కాదు. ఈ విషయమై దేశ పరిస్థితులను బట్టి అవసరమా? లేదా? అనేది పరిశీలించి కేంద్రం తగిన నిర్ణయం తీసుకుంటుంది. అమిత్‌షా అంటే వైకాపా నేతలకు భయం.. నాకు గౌరవం’ అని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ అన్నారు. చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా బుధవారం తిరుపతిలో మీడియాతో పలు అంశాలపై మాట్లాడారు. ఆయన మాటల్లోనే.. ‘‘పరిపాలన సౌలభ్యం కోసం ప్రభుత్వం తెలుగులోనే ఉత్తర్వులు జారీ చేయాలి. తల్లిదండ్రులకు మాధ్యమం ఎంపిక చేసుకునే అవకాశం కల్పించాలి.

అన్యమత ప్రచారంపై ప్రజల ఆవేదన...
తిరుమలలో అన్యమత ప్రచారం ఎక్కువైందని భక్తులు వేదన చెందుతున్నారు. జగన్‌రెడ్డి ఇంటికి 10 కి.మీ దూరంలో ఉన్న విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం ఎదురుగా ఉన్న కృష్ణ పుష్కరఘాట్‌లో 42 మందికిపైగా మూకుమ్మడి మతమార్పిడి జరుగుతుంటే ముఖ్యమంత్రికి తెలియదా? మత మార్పిడులపై ప్రభుత్వం సమాధానం చెప్పాలి’’ అని పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు.

రాజకీయం

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.