సోనియాకు కాంగ్రెస్‌ సీనియర్ల లేఖ

తాజా వార్తలు

Published : 24/08/2020 00:31 IST

సోనియాకు కాంగ్రెస్‌ సీనియర్ల లేఖ

పార్టీలో మార్పులు కోరుతున్న నేతలు
రేపు సీడబ్ల్యూసీపై దీనిపై ప్రధాన చర్చ!

దిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ అత్యున్నత సారథ్య సంఘం సీడబ్ల్యూసీ రేపు సమావేశం అవుతున్న వేళ ఆ పార్టీ సీనియర్‌ నేతలు అధినేత్రి సోనియా గాంధీకి రాసిన లేఖ ఒకటి వెలుగులోకి వచ్చింది. పార్టీలో మార్పులు సూచిస్తూ 23 మంది నేతలు ఈ లేఖ రాశారు. వీరిలో గులాంనంబీ ఆజాద్‌, ఆనంద్‌ శర్మ, శశి థరూర్‌, కపిల్‌ సిబల్‌, మనీశ్‌ తివారీ, రాజ్‌ బబ్బర్‌, పృథ్వీరాజ్ చవాన్‌ తదితరులు ఉన్నారు. స్వాతంత్ర్యం తర్వాత గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న పార్టీని సమర్థంగా నడిపే పూర్తి నాయకత్వం అవసరాన్ని వారు సూచించారు. అలాగే పార్టీని నడిపే వ్యవస్థ కూడా అవసరమన్నారు. సీడబ్ల్యూసీకి కూడా ఎన్నికలు నిర్వహించాలని కోరారు. గత కొద్దిరోజులుగా నాయకత్వం అంశంపై చర్చ జరుగుతున్న వేళ ఈ లేఖ రాయడం ప్రాధాన్యం సంతరించుకుంది. రేపు జరిగే సీడబ్ల్యూసీ భేటీలో దీనిపైనే ప్రధానంగా చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది.

మరోవైపు రేపు ఉదయం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సీడబ్ల్యూసీ భేటీ జరగనుంది. పార్టీ అధ్యక్ష బాధ్యతలు, పార్టీ కేంద్ర కార్యాలయం మార్పు, కొత్త కమిటీల నియామకం వంటి కీలక అంశాలపై చర్చించనున్నారు. ప్రస్తుతం పార్టీ నాయకత్వం మార్పు వ్యవహారంలో సీనియర్లు, జూనియర్ల మధ్య అంతర్యుద్ధం జరుగుతోంది. ఈ క్రమంలో రాహుల్‌ గాంధీ మళ్లీ పగ్గాలు చేపట్టాలని లేదా గాంధీ కుటుంబం కాకుండా గట్టి నిర్ణయాలు తీసుకునే నాయకుడిని అధ్యక్షుడిగా నియమించాలని లేదా అధ్యక్ష పదవికి ఎన్నికలు నిర్వహించాలని నేతలు సూచిస్తున్నారు. అలాగే అక్బర్‌ రోడ్డులో ఉన్న కాంగ్రెస్‌ కేంద్ర కార్యాలయాన్ని సెప్టెంబర్‌ లోగా ఖాళీ చేయాల్సి ఉండగా.. దీనిపై మరికొంత సమయం కోరే అవకాశం ఉంది. మరికొన్ని అంశాలపైనా రేపు సీడబ్ల్యూసీలో నిర్ణయాలు వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని