కేంద్రం నోటీసులను చించేసిన ఆమ్‌ఆద్మీ 

తాజా వార్తలు

Published : 12/09/2020 01:41 IST

కేంద్రం నోటీసులను చించేసిన ఆమ్‌ఆద్మీ 

దిల్లీ: దేశ రాజధాని దిల్లీ పరిసరాల్లోని మురికివాడలు, రైల్వేట్రాక్‌ వెంబడి నివాసముంటున్న వారిని ఖాళీ చేయించాలని కోరుతూ కేంద్రం జారీ చేసిన నోటీసులను ఆప్‌ అధికార ప్రతినిధి రాఘవ్‌చందా చించివేశారు. అవసరమైతే దీనిపై సుప్రీం కోర్టుకు వెళ్తామని ఆయన స్పష్టం చేశారు. దీనిని దిల్లీ భాజపా తీవ్రంగా పరిగణించింది. కేంద్రం నోటీసులను చించివేయడం క్షమించరాని నేరమని ఆక్షేపించింది. మురికివాడలను ఖాళీ చేయించాలని గతంలోనే సుప్రీం స్పష్టమైన ఆదేశాలిచ్చిందని తెలిపింది.

కేంద్రం నోటీసులు జారీ చేయడంపై రాఘవ్‌ చందా మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ బతికున్నంత వరకు దిల్లీలోని మురికివాడల్లో నివాసముంటున్న వారిని ఖాళీ చేయించడం ఎవరివల్లా కాదన్నారు. వారికి సరైన పునరావాసం కల్పించిన తర్వాతనే ఆ అంశంపై ఆలోచిస్తామని చెప్పారు. ఈ అంశంపై పోరాడేందుకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు.

మురికివాడలను ఖాళీ చేయించాలని కోరుతూ కేంద్రం వేసిన పిటిషన్‌పై ఇటీవల విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు మూడు నెలల్లోగా దిల్లీ పరిసర ప్రాంతాల్లోని దాదాపు 48,000 ఇళ్లను కూల్చేయాల్సిందిగా ఆదేశాలిచ్చింది. దీనిపై స్పందించిన ఆప్‌ ప్రభుత్వం పేదలకు ఇళ్లు లేకుండా చేసేందుకు అధికార భాజపా ప్రయత్నిస్తోందని విమర్శించింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని