అమరావతిపై మాకు స్పష్టత ఉంది:సోమువీర్రాజు

తాజా వార్తలు

Published : 27/10/2020 01:16 IST

అమరావతిపై మాకు స్పష్టత ఉంది:సోమువీర్రాజు

విజయవాడ: రాజధాని అమరావతిపై భాజపాకు స్పష్టమైన అవగాహన ఉందని, పూర్తి నిబద్ధతతో ఉన్నామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టం చేశారు. హైకోర్టు కర్నూలులోనే ఉండాలని తమ పార్టీ తీర్మానం చేసిందన్నారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అమరావతిలోనే రాజధాని ఉండాలని... రాజధానిపై తమకున్న స్పష్టత తెదేపా, వైకాపాకు లేవని విమర్శించారు. అమరావతి పరిధిలోని రైతులకు 64వేల ప్లాట్లు వెంటనే ఇవ్వాలని.. రాజధాని గ్రామాల్లో 9వేల ఎకరాలు అభివృద్ధి చేయాలని సోము వీర్రాజు డిమాండ్‌ చేశారు. ఆవ భూములు, హిందూ దేవాలయాలపై దాడులు, ఆలయ భూముల ఆక్రమణ అంశాల్లో తాము పోరాటం చేశామని.. అవినీతిపై తెదేపా, వైకాపా రెండింటినీ సహించేది లేదన్నారు. 
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధుల వినియోగంలో పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని సోము వీర్రాజు ఆరోపించారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న అవినీతిపై భాజపా, జనసేన ప్రజాఉద్యమం చేపడుతుందని తెలిపారు. మంగళగిరి ఎయిమ్స్‌ను తక్కువ ఖర్చుతో కేంద్ర ప్రభుత్వం నిర్మించి చూపించిందని.. అప్పటి, ఇప్పటి ప్రభుత్వాలు ఎయిమ్స్‌ రహదారికి కనీసం స్థలం ఇవ్వలేదని ఆక్షేపించారు. కేంద్ర ప్రభుత్వం రాజధానికి కేటాయించిన నిధులకు తెదేపా అధినేత చంద్రబాబు లెక్కలు చెప్పాలని సోము వీర్రాజు డిమాండ్‌ చేశారు. జగన్‌ ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడం తప్ప చేతల్లో చూపిండం లేదని విమర్శించారు. గత ప్రభుత్వం చేపట్టిన అనేక ప్రాజెక్టులను వైకాపా ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని సోము వీర్రాజు ఆరోపించారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని