సోము వీర్రాజును నిర్బంధించిన పోలీసులు

తాజా వార్తలు

Published : 17/09/2020 18:25 IST

సోము వీర్రాజును నిర్బంధించిన పోలీసులు

విజయవాడ: ఏపీ భాజపా రేపు నిర్వహించతలపెట్టిన ‘చలో అమలాపురం’ కార్యక్రమం నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. విజయవాడలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజును నిర్బంధించారు. రేపటి కార్యక్రమానికి బయల్దేరుతుండగా అడ్డుకున్నారు. అమలాపురంలో సెక్షన్‌ 30, 144 సెక్షన్‌ అమల్లో ఉందని.. అందుకే నిర్బంధించినట్లు పోలీసులు చెప్పారు. అంతర్వేది రథం దగ్ధం ఘటనకు నిరసనగా భాజపా చలో అమలాపురానికి పిలుపునిచ్చింది. అయితే ఈ కార్యక్రమానికి అనుమతి లేదని ఏలూరు రేంజ్‌ డీఐజీ మోహనరావు తెలిపారు. కోనసీమ ప్రాంతంలో సెక్షన్‌ 30 అమల్లో ఉందన్నారు. ఎవరైనా చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.

మరోవైపు రాష్ట్రంలోనూ పలుచోట్ల భాజపా నేతలను పోలీసులు నిర్బంధిస్తున్నారు. గుంటూరులో ఏపీ భాజపా మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, విశాఖలో మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌ రాజును పోలీసులు నిర్బంధించారు. 

 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని