తెదేపా నిర్ణయాల వల్లే ఈ ఇబ్బందులు:బుగ్గన

తాజా వార్తలు

Published : 24/10/2020 02:05 IST

తెదేపా నిర్ణయాల వల్లే ఈ ఇబ్బందులు:బుగ్గన

దిల్లీ: పోలవరం ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేయాలని ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి కోరారు. ఈ మేరకు దిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసి ఆయన విజ్ఞప్తి చేశారు. కేంద్రమంత్రితో భేటీ అనంతరం బుగ్గన మీడియాతో మాట్లాడారు. పోలవరాన్ని తామే నిర్మిస్తామని విభజన చట్టంలో కేంద్రం పేర్కొందని గుర్తు చేశారు. సొంత ప్రయోజనాల కోసమే పోలవరం నిర్మాణాన్ని తెదేపా ప్రభుత్వం చేపట్టిందని ఆయన ఆరోపించారు. గత ప్రభుత్వ నిర్ణయాల వల్లే ప్రస్తుతం ఈ ఇబ్బందులని బుగ్గన వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు దాదాపు రూ.4వేల కోట్లు పోలవరానికి ఖర్చు చేసిందని.. ఆ నిధులు వెంటనే విడుదల చేయాని నిర్మలా సీతారామన్‌ను కోరినట్లు ఆయన చెప్పారు.

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని