ఏపీ మంత్రివర్గ సమావేశం ప్రారంభం

తాజా వార్తలు

Updated : 05/11/2020 12:03 IST

ఏపీ మంత్రివర్గ సమావేశం ప్రారంభం

అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో మంత్రివర్గం సమావేశమైంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణతోపాటు ప్రస్తుతమున్న ఇసుక విధానం స్థానంలో కొత్తది తీసుకొచ్చే అంశంపై చర్చించే అవకాశముంది. దీనిపై ఏర్పాటు చేసిన మంత్రుల కమిటీ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. మరోవైపు ఈ నెల మూడో వారం నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలనే యోచనలో ప్రభుత్వం ఉంది. దీనిపై మంత్రివర్గంతో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. వైద్య కళాశాలలకు భూ కేటాయింపులు, రవాణా పన్నుల పెంపు ప్రతిపాదనలు తదితర అంశాలపై చర్చించే అవకాశముంది.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని