మాజీ మంత్రి మాణిక్యాలరావు కన్నుమూత

తాజా వార్తలు

Published : 02/08/2020 00:59 IST

మాజీ మంత్రి మాణిక్యాలరావు కన్నుమూత

విజయవాడ: భాజపా నేత, మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాల రావు కన్నుమూశారు. గతకొద్ది రోజులుగా కరోనాతో చికిత్స పొందుతున్న ఆయన విజయవాడలో శనివారం తుదిశ్వాస విడిచారు. మాణిక్యాలరావు వయస్సు 59 ఏళ్లు. కరోనా బారిన పడిన మాణిక్యాలరావు 20 రోజుల క్రితం ఏలూరు కొవిడ్‌ ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. అయితే, ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో వారం క్రితమే విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. గత కొద్ది రోజులుగా వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం విషమించడంతో ప్రాణాలు విడిచారు. మాణిక్యాలరావుకు భార్య సూర్యకుమారి, కుమార్తె సింధు ఉన్నారు. 

9ఏళ్లకే ఆర్‌ఎస్‌ఎస్‌లో చేరి.. అంచెలంచెలుగా ఎదిగి..

1961 నవంబర్‌ 1న తాడేపల్లిగూడెంలో జన్మించిన మాణిక్యాలరావు .. అక్కడే పాఠశాల విద్యనభ్యసించారు. ఆ తర్వాత కళాశాల విద్యను పెంటపాడులో పూర్తిచేశారు. 9 ఏళ్ల వయస్సులోనే రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌)లో చేరారు. భాజపా ఆవిర్భావం నుంచి ఆ పార్టీలోనే కొనసాగుతున్నారు. ఫొటోగ్రాఫర్‌గా వృత్తి జీవితాన్ని ప్రారంభించిన ఆయన.. ఫొటోస్టూడియో మూసివేసి సింధు షూమార్ట్‌ను ప్రారంభించారు. దాన్ని సింధు ఎంటర్‌ప్రైజెస్‌గా మార్చి ఆటోమొబైల్‌ విడిభాగాల విక్రయాలు చేసేవారు. 2011-2013 వరకు మానవత సంస్థ తాడేపల్లిగూడెం పట్టణ అధ్యక్షుడిగా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఆ సంస్థ ద్వారా జిల్లాలోని పలు పట్టణాల్లో శీతల శవపేటికలు ఉచితంగా ఏర్పాటు చేసేవారు. రాష్ట్ర విభజన అనంతరం తెదేపా -భాజపా కూటిమి అభ్యర్థిగా 2014లో తాడేపల్లిగూడెం నుంచి పోటీచేసిన ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014 నుంచి 2018 వరకు తెదేపా ప్రభుత్వంలో దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.

ప్రముఖులతో మాణిక్యాలరావు.. చిత్రాలు

తనకు కరోనా పాజిటివ్‌గా వచ్చిన విషయాన్ని ప్రకటిస్తూ ప్రజలంతా జాగ్రత్తగాఉండాలని కోరుతూ జులై 4న మాణిక్యాలరావు ఇచ్చిన వీడియో సందేశం



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని