‘కత్తి కంటే కలం పదునైనదని తెలుసుకున్నా’

తాజా వార్తలు

Published : 18/10/2020 02:53 IST

‘కత్తి కంటే కలం పదునైనదని తెలుసుకున్నా’

పుణె: ప్రస్తుతం దేశంలో జరుగుతున్న సంఘటనల ద్వారా ‘కత్తి కంటే.. కలం పదునైనది’ అనే మాట తనకు అర్థమవుతోందని కాంగ్రెస్‌ నాయకుడు, ఎంపీ శశిథరూర్‌ అన్నారు. దేశంలో చాలా మంది సామాజిక కార్యకర్తలు ఎలాంటి నేరాల్లో తలదూర్చనప్పటికీ.. గొంతు విప్పి తమ ఆలోచనల్ని వెల్లడించినందుకు పోలీసుల నిర్బంధంలోకి వెళ్లాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన సింబయాసిస్‌ అంతయర్జాతీయ విశ్వవిద్యాలయ అక్షరాస్యత కార్యక్రమంలో వర్చువల్‌గా పాల్గొని ప్రసంగించారు. ‘నేను పాఠశాల రోజుల్లో కలం.. కత్తి కంటే పదునైనది అనే విషయాన్ని విన్నాను. ఆ విషయాన్ని ఇప్పుడు మనదేశంలో చోటుచేసుకున్న పలు సంఘటనల ద్వారా తెలుసుకోగలిగాను. ఎలాంటి నేరంలో తలదూర్చనప్పటికీ.. కేవలం తమ ఆలోచనల్ని వెల్లడించినందుకు గానూ కార్యకర్తలు వరవరరావు, సుధా భరద్వాజ్‌, ఆనంద్‌ తెల్తుంబ్డే వంటి వారిని అదుపులోకి తీసుకున్నారు. వారు ఆయుధాలు పట్టలేదు, కనీసం ఎవరి మీదా చేయి చేసుకోలేదు, రాళ్లు కూడా విసరలేదు.. అయినా నిర్బంధానికి గురయ్యారు’అని థరూర్‌ పేర్కొన్నారు.

భీమా కొరేగావ్‌(జనవరి, 2018) హింసకు సంబంధించి వరవరరావు సహా ఇతర కార్యకర్తలను మావోలతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని