అంబటి రాంబాబుకు రెండోసారి కరోనా

తాజా వార్తలు

Published : 06/12/2020 02:50 IST

అంబటి రాంబాబుకు రెండోసారి కరోనా

గుంటూరు: వైకాపా నేత, సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు మరోసారి కరోనా సోకింది. ఇప్పటికే ఓసారి కొవిడ్‌ బారిన పడిన తనకు మరోసారి ఈ వైరస్‌ సోకినట్టు ఆయన ట్విటర్‌లో ప్రకటించారు. రీఇన్ఫెక్షన్‌కు గురికావడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ‘‘జులైలో నాకు కొవిడ్‌ వచ్చి తగ్గిన సంగతి మీ అందరికీ విదితమే. నిన్న అసెంబ్లీలో కొవిడ్ టెస్ట్‌ చేయించాను. పాజిటివ్‌గా రిపోర్టు వచ్చింది. రీ ఇన్ఫెక్షన్‌కు గురికావడం ఆశ్చర్యం కలిగించింది. అవసరమైతే ఆస్పత్రిలో చేరతాను. మీ ఆశీస్సులతో మరోసారి కరోనాను జయించి మీ ముందుకు వస్తా’’ అని ఆయన ట్విటర్‌లో పేర్కొన్నారు.

ఇటీవల తెదేపా ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడికి రెండోసారి కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో మెరుగైన వైద్యం కోసం ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని