అప్పులతో నవరత్నాల అమలు:సోము వీర్రాజు

తాజా వార్తలు

Updated : 03/12/2020 00:55 IST

అప్పులతో నవరత్నాల అమలు:సోము వీర్రాజు

విజయవాడ: అభివృద్ధి ఒక్కటే తమ పార్టీ నినాదమని, ప్రధాని మోదీ శ్వాస, ధ్యాస కూడా అదేనని ఏపీ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. తమది సకల జనుల పార్టీ అని.. ప్రాంతీయ పార్టీల మాదిరిగా రాగద్వేషాలు ఉండబోవని చెప్పారు. విజయవాడలో మీడియాతో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి కార్యక్రమం వెనుకా కేంద్ర ప్రభుత్వం అందించిన నిధులే ఉన్నాయన్నారు. ఆ నిధులను రాష్ట్ర ప్రభుత్వం తమ పథకాలుగా ప్రచారం చేసుకుంటోందని సోమువీర్రాజు ఆరోపించారు. ప్రభుత్వం అప్పులు చేసి నవరత్నాలు అందిస్తోందని ఆక్షేపించారు. విద్య, వైద్యం, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి.. ఇలా 35 అంశాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు అందుతున్నట్లు చెప్పారు. వైకాపా, తెదేపా రెండూ అంటకాగే పార్టీలని ధ్వజమెత్తారు. అమరావతి విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరుతున్న వారంతా విజయవాడ, అమరావతి చుట్టూ జరుగుతున్న అభివృద్ధిని చూడాన్నారు. అమరావతే రాజధానిగా కొనసాగుతుందని సోమువీర్రాజు స్పష్టం చేశారు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని