సుశీల్‌ మోదీకి కేంద్ర మంత్రివర్గంలో చోటు..?
close

తాజా వార్తలు

Published : 16/11/2020 01:11 IST

సుశీల్‌ మోదీకి కేంద్ర మంత్రివర్గంలో చోటు..?

పట్నా: బిహార్‌ ఎన్నికల్లో మరోసారి విజయం సాధించిన ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. మరోసారి బిహార్‌ ముఖ్యమంత్రిగా నీతీశ్‌ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. భాజపా శాసనసభాపక్ష నేతగా కతిహార్‌ ఎమ్మెల్యే తార్‌కిషోర్‌ ప్రసాద్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇప్పటి వరకు నీతీశ్‌ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న సుశీల్‌ కుమార్‌ మోదీ స్థానంలో తార్‌కిషోర్‌ ప్రసాద్‌ డిప్యూటీ సీఎంగా నియమితులు కాబోతున్నట్లు రాజకీయ వర్గాలు పేర్కొన్నాయి. అయితే, సుశీల్‌ కుమార్‌ మోదీకి కేంద్ర మంత్రివర్గంలో చోటు కల్పించే అవకాశాలు ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఎన్నికల ఇన్‌ఛార్జి దేవేంద్ర ఫడణవీస్‌, రాష్ట్ర సీనియర్‌ నేతలతో కలిసి బిహార్‌ ఎన్నికల్లో భాజపా అత్యధిక సీట్లను సాధించడంలో సుశీల్‌ కుమార్‌ మోదీ కీలక పాత్ర పోషించారు. అటువంటి సీనియర్‌ నేతకు కేంద్ర మంత్రివర్గంలో చోటు కల్పించడం ఖాయమని భాజపా వర్గాలు చెబుతున్నాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని