close

తాజా వార్తలు

Updated : 22/11/2020 17:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

‘తెరాస యాక్షన్‌ బట్టే భాజపా రియాక్షన్‌’


భాజపా ఎమ్మెల్యే రఘునందన్‌ వ్యాఖ్య

హైదరాబాద్‌: కేంద్రం ఏం ఇచ్చిందని అంటున్న మంత్రి కేటీఆర్‌.. హైదరాబాద్‌కు మీరేం చేశారని భాజపా ఎమ్మెల్యే రఘునందన్‌రావు ప్రశ్నించారు. దేవాలయాల గురించి మాట్లాడే హక్కు కేసీఆర్‌, కేటీఆర్‌లకు లేదన్నారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికలను హిందూ ముస్లింల మధ్య పోటీగా చిత్రీకరించవద్దన్నారు. సెక్యులర్‌ అనే పదానికి అర్థం కేటీఆర్‌కు తెలుసా అని ప్రశ్నించారు. తెరాస యాక్షన్‌ బట్టే.. భాజపా రియాక్షన్‌ ఉంటుందని రఘునందన్‌ వ్యాఖ్యానించారు.

మౌలాలి అభివృద్ధికి ఏం చేశారు?

అంతకుముందు మౌలాలిలో భాజపా అభ్యర్థి సునీతా చంద్రశేఖర్‌ యాదవ్‌కు మద్దతుగా రఘునందన్‌ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన రోడ్‌షోలో ఆయన మాట్లాడుతూ మౌలాలి డివిజన్‌ అభివృద్ధికి తెరాస ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని డిమాండ్‌ చేశారు. దమ్ముంటే మౌలాలి వచ్చి చేసిన అభివృద్ధిని చూపించాలని మంత్రి కేటీఆర్‌కు ఆయన సవాల్‌ విసిరారు. నాలాలో కొట్టుకుపోయి మృతిచెందిన బాలిక సుమేధ హత్యకు బాధ్యత వహించాలని.. ఆమె కుటుంబసభ్యులకు కేటీఆర్‌ బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు. సామాన్యుల ఇళ్లకు రూ.వేలల్లో పన్నులు వేస్తుంటే మౌలాలి తెరాస కార్పొరేటర్‌ ఇంటికి రూ.101 మాత్రమే పన్నువేశారని ఆరోపించారు. ఇది న్యాయమా?నగరాన్ని జలగల్లా పీడించింది తెరాస కార్పొరేటర్లు కాదా? అని రఘునందన్‌ ప్రశ్నించారు. తెరాస పాలనలో ఒక్క ఉద్యోగమైనా వచ్చిందా? అని నిలదీశారు.Tags :

రాజకీయం

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని