దారిలో నవ్వులు.. ఇంట్లో ఏడుపులు

తాజా వార్తలు

Published : 06/10/2020 01:41 IST

దారిలో నవ్వులు.. ఇంట్లో ఏడుపులు

రాహుల్‌ది విదేశీ మనస్తత్వం అన్న వివాదాస్పద ఎమ్మెల్యే

లఖ్‌నవూ: తల్లిదండ్రులు కూతుళ్లకు సంస్కృతి, సంస్కారం నేర్పితే అత్యాచారాలు తగ్గుతాయని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన భాజపా ఎమ్మెల్యే ఆ వ్యాఖ్యలపై స్పందించిన రాహుల్‌గాంధీపై మండిపడ్డారు. ఆయనది విదేశీ మనస్తత్వమని ఆరోపించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని హాథ్రస్‌లో హత్యాచార ఘటనతో యూపీ సర్కారుపై ప్రతిపక్షాలు విమర్శనాస్త్రాలు సంధించాయి. ఈ నేపథ్యంలో స్పందించిన బాల్లియా ఎమ్మెల్యే సురేంద్రసింగ్‌ ఆడపిల్లలకు సంస్కారం నేర్పితేనే అత్యాచారాలు తగ్గుతాయని, ప్రభుత్వం వాటిని పూర్తిగా ఆపలేదనడం దేశవ్యాప్తంగా దుమారం రేపింది. ఎమ్మెల్యే వ్యాఖ్యలకు ప్రతిపక్షాలతోపాటు పలువురు మండిపడ్డారు. కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ సైతం స్పందించారు. నీచ మనస్తత్వం గల ఆరెస్సెస్‌ నేతగా సురేంద్రసింగ్‌ను అభివర్ణించారు.

ఈ నేపథ్యంలోనే సదరు ఎమ్మెల్యే న్యూస్‌ ఏజెన్సీ పీటీఐతో మాట్లాడుతూ రాహుల్‌ గాంధీపై విరుచుకుపడ్డారు. రాహుల్‌కు భారత సంప్రదాయం తెలియదని, అతడిది విదేశీ మనస్తత్వం అని దుయ్యబట్టారు. ‘రాహుల్‌ జాతీయవాదుల వద్ద ట్యూషన్‌కి వెళ్లినప్పుడే అతడికి జాతీయవాదం అంటే ఏమిటో అర్థమవుతుంది. అతడిది ద్వంద్వ వైఖరి. హాథ్రస్‌ బాధితుల వద్దకు వెళ్లినప్పుడు రాహుల్‌, ప్రియాంకాల వైఖరి స్పష్టమైంది. ప్రయాణంలో నవ్వుకుంటూ వెళ్లి బాధితురాలి ఇంట్లో కన్నీళ్లు కార్చారు’ అంటూ ఎద్దేవా చేశారు.

హాథ్రస్‌లో 19 ఏళ్ల దళిత యువతిపై అత్యాచారం, హత్య కేసులో పోలీసులు నలుగురు నిందితులను అరెస్టు చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని, బాధితురాలికి న్యాయం జరగాలంటూ దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. గురువారం యువతి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన రాహుల్‌గాంధీని పోలీసులు అడ్డుకున్నారు. కాగా ఆయన సోదరి ప్రియాంకతో కలిసి శనివారం బాధితురాలి ఇంటికి వెళ్లి ఆమె కుటుంబసభ్యులను పరామర్శించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని