చలో అమలాపురం ఎక్కడికక్కడ భగ్నం

తాజా వార్తలు

Updated : 18/09/2020 12:34 IST

చలో అమలాపురం ఎక్కడికక్కడ భగ్నం

ఇంటర్నెట్‌డెస్క్‌: అంతర్వేదిలో రథం దగ్ధం ఘటనను వ్యతిరేకిస్తూ భాజపా పిలుపునిచ్చిన చలో అమలాపురం కార్యక్రమాన్ని పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. నిన్న సాయంత్రం నుంచే భాజపా నేతలను గృహనిర్బంధం చేస్తున్నారు. ఏలూరు రేంజ్‌ డీఐజీ మోహనరావు ఆధ్వర్యంలో  అమలాపురంలో పటిష్ఠ పహారా ఏర్పాటు చేశారు.

కోనసీమలో నిషేదాజ్ఞలు అమల్లో ఉన్నందున చలో అమలాపురానికి అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. విజయవాడ సమీపంలోని తాడేపల్లి కరకట్ట వద్ద భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజును గృహ నిర్బంధం చేశారు. పార్టీ నేతలతో కలిసి అమలాపురం వెళ్లకుండా ఆయన్ను నిలువరించారు. సోము వీర్రాజు నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. వీర్రాజును గృహనిర్బంధం నుంచి విడుదల చేయలాంటూ భాజపా శ్రేణులు ధర్నా చేపట్టాయి. వైకాపాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మరో వైపు అమలాపురం చేరుకున్న ఎమ్మెల్సీ మాధవ్‌, యామినిశర్మ, భాజపా కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని అమలాపురం, అంబాజీపేట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్థన్‌రెడ్డిని ఆయన నివాసంలో గృహనిర్బంధం చేశారు. తాము శాంతియుతంగా నిరసన చేయదలచుకుంటే ..ఎందుకు అడ్డుకుంటున్నారంటూ పోలీసులను ఆయన ప్రశ్నించారు. కృష్ణా జిల్లా హనుమాన్‌జంక్షన్‌ వద్ద మాజీ మంత్రి రావెలకిశోర్‌బాబు, మాజీ ఎమ్మెల్యే చిన్నం రామకోటయ్య సహా పదిమంది భాజపా నేతలను అదుపులోకి తీసుకుని జనసేన నేత చలమలశెట్టి రమేష్‌ ఇంటికి తరలించి అక్కడ గృహనిర్బంధం చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని