ఏడాదిలో ఎన్డీయే నుంచి రెండు పార్టీలు బయటకు

తాజా వార్తలు

Published : 28/09/2020 01:17 IST

ఏడాదిలో ఎన్డీయే నుంచి రెండు పార్టీలు బయటకు

దిల్లీ: భాజపా నేతృత్వంలోని ఎన్డీయే కూటమి మరో మిత్రపక్షాన్ని కోల్పోయింది. చాలాకాలంగా భాగస్వామిగా ఉన్న శిరోమణి అకాలీదళ్‌ వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ కూటమి నుంచి వైదొలిగింది. గతేడాది శివసేన దూరమైంది. ఇలా ఏడాదిలోనే ఏళ్లుగా ఉంటున్న రెండు పార్టీలు కూటమిని వీడడం ప్రస్తుత రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. 

ఇటీవల కేంద్రం పార్లమెంట్‌లో మూడు వ్యవసాయ బిల్లులు ప్రవేశపెట్టింది. ఇవి రైతులను కష్టాల్లోకి నెడతాయంటూ శిరోమణి అకాలీదళ్‌ ఎన్డీయే నుంచి బయటికొచ్చింది. దీంతో రెండున్నర దశాబ్దాల బంధానికి తెరపడింది. కేంద్రంలోని భాజపాకు దీనివల్ల పెద్దగా నష్టం లేకపోయినప్పటికీ.. పంజాబ్‌ రాజకీయాల్లో మాత్రం ఆ పార్టీపై ప్రభావం పడనుంది.

ఎన్డీయే కూటమి ప్రారంభమైన నాటి నుంచి భాజపా వెన్నంటి ఉన్న శివసేన సైతం 2019లో జరిగిన మహారాష్ర్ట అసెంబ్లీ ఎన్నికల తర్వాత భాజపాకు దూరం అయ్యింది. సీఎం సీటు తమ పార్టీ అభ్యర్థి ఫడణవీస్‌కే ఇవ్వాలని భాజపా.. శివసేన అభ్యర్థే ముఖ్యమంత్రి పీఠం అధిరోహించాలని జరిగిన కుర్చీల కొట్లాటలో శివసేన... భాజపాకు దూరమై ఎన్సీపీ, కాంగ్రెస్‌తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇలా ఏళ్లుగా మిత్రపక్షాలుగా కొనసాగిన రెండు పార్టీలు భాజపా వైఖరిని తప్పుపడుతూ కూటమిని వీడాయి. 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలోనూ 2014 నుంచి ఐదేళ్లపాటు మిత్రపక్షంగా కొనసాగిన తెలుగుదేశం పార్టీ భాజపాతో విభేదించి ఎన్డీయే నుంచి బయటకొచ్చింది. ఎవరు కూటమిని వీడినా తాము మాత్రం పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ముందుకెళ్తామని ఆ పార్టీ చెబుతోంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని