రాజస్థాన్‌లో కాంగ్రెస్‌కు షాక్
close

తాజా వార్తలు

Published : 09/12/2020 23:25 IST

రాజస్థాన్‌లో కాంగ్రెస్‌కు షాక్

స్థానిక ఎన్నికల ఫలితాల్లో ఆధిక్యంలో భాజపా

దిల్లీ: రాజస్థాన్‌లో స్థానిక సంస్థల ఎన్నికల్లో భాజపా విజయం.. ప్రజలకు ప్రధాని మోదీపై ఉన్న విశ్వాసాన్ని వెల్లడిచేస్తుందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. ‘రాజస్థాన్‌ పంచాయతీ, జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో గ్రామీణ ఓటర్లు, మహిళలు, రైతులు మాపై నమ్మకం ఉంచినందుకు కృతజ్ఞతలు. గ్రామాలు, పేదలు, రైతులు, కార్మికులకు ప్రధాని నరేంద్రమోదీపై ఉన్న విశ్వాసానికి ఈ విజయం నిదర్శనం’ అని నడ్డా ట్వీట్ చేశారు. పూర్తిస్థాయి ఫలితాలు వెల్లడికావాల్సి ఉండగా..ఆధిక్యాన్ని కనబరుస్తోన్న భాజపా తన విజయాన్ని ప్రకటించుకుంది. 

రాజస్థాన్‌లోని 21 జిల్లాలు, 59 పంచాయతీ సమితుల్లో ఎన్నికలు జరిగాయి. పంచాయతీ సమితుల్లోని 4,371 స్థానాలకు గానూ భాజపా 1,835, కాంగ్రెస్ 1,718, స్వతంత్రులు 420, రాష్ట్రీయ లోక్‌ తాంత్రిక్ పార్టీ 56 సీట్లను దక్కించుకుంది. అలాగే 636 సీట్లున్న జిల్లా పరిషత్‌లో 266 సీట్లను భాజపా కైవసం చేసుకోగా..204 స్థానాలను కాంగ్రెస్ దక్కించుకుందని సంబంధిత అధికారి వెల్లడించారు.

కాగా, రాజస్థాన్‌ గ్రామీణ ప్రాంతంలో కాంగ్రెస్‌కు ఎదురైన పరాభవం..ఆ పార్టీ తన సంప్రదాయ ఓటు బ్యాంకును కోల్పోతుందనేదానికి సంకేతంగా కనిపిస్తోంది. కొద్ది నెలల క్రితం ఆ రాష్ట్రంలో పార్టీ కీలక నేతలు అశోక్‌ గహ్లోత్, సచిన్‌ పైలట్ మధ్య చెలరేగిన వివాదం, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి నుంచి పైలట్ వైదొలగడంతో ఏర్పడిన శూన్యత..పార్టీ పనితీరుపై ప్రభావం చూపినట్లు కొందరు నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.  

ఇవీ చదవండి: 

రాష్ట్రంలో వచ్చేది భాజపా ప్రభుత్వమే: బండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని