ఇదే దూకుడుతో వెళ్లాలని చెప్పారు: బండి

తాజా వార్తలు

Published : 07/12/2020 00:59 IST

ఇదే దూకుడుతో వెళ్లాలని చెప్పారు: బండి

దిల్లీ: జీహెచ్‌ఎంసీ ఫలితాలపై రాష్ట్ర నేతలను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా అభినందించారని.. భవిష్యత్‌లో జరిగే ఎన్నికల్లోనూ ఇదే దూకుడుతో వెళ్లాలని ఆయన సూచించారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ తెలిపారు. అమిత్‌షాతో ప్రముఖ సినీనటి, మాజీ ఎంపీ విజయశాంతి భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తెరాస ప్రజావ్యతిరేక విధానాలపై భాజపా పోరాటం చేస్తుందన్నారు. తెలంగాణలో అసలైన ఉద్యమకారులను తెరాస విస్మరిస్తోందని.. ఈ వైఖరి కారణంగానే వారు భాజపాలోకి వస్తున్నారని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో విజయశాంతి కీలకపాత్ర  షోషించారని, రేపు ఉదయం 11 గంటలకు ఆమె భాజపాలో చేరతారని బండి సంజయ్‌ తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని