ఎన్నికల ముందు మాయావతికి షాక్‌!
close

తాజా వార్తలు

Published : 04/10/2020 01:25 IST

ఎన్నికల ముందు మాయావతికి షాక్‌!

పట్నా: బిహార్‌ ఎన్నికల వేళ మాయవతి నేతృత్వంలోని బహుజన్‌ సమాజ్‌ పార్టీ (బీఎస్పీ)కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ బిహార్‌ రాష్ట్ర అధ్యక్షుడు భారత్‌ బింద్‌ పార్టీని వీడి ఆర్జేడీలో చేరారు. శనివారం తేజస్వీయాదవ్‌ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. భారత్‌ బింద్‌కు సభ్యత్వం తేజస్వీ యాదవ్‌ పార్టీలోకి ఆహ్వానించారు. దీనికి సంబంధించిన చిత్రాన్ని ఆర్జేడీ తన పార్టీ ట్విటర్‌ ఖాతాలో ఉంచింది.

బిహార్‌ ఎన్నికల్లో ఎన్డీయే, మహా కూటమి కాదని కేంద్రమాజీ మంత్రి, రాష్ట్రీయ లోక్‌ సమతా పార్టీ (ఆర్‌ఎల్‌ఎస్‌పీ) అధ్యక్షుడు ఉపేంద్ర కుష్వహ తృతీయ కూటమిని ఏర్పాటు చేశారు. ఇందులో మాయవతి నేతృత్వంలోని బీఎస్పీ, జనతాంత్రిక్‌ పార్టీ (సోషలిస్ట్‌)లు ఉన్నాయి. ఈ కూటమి తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా కుష్వహ పేరును మాయవతి ప్రకటించారు. ఈ క్రమంలో ఎన్నికల్లో పార్టీని ముందుండి నడిపించాల్సిన రాష్ట్ర అధ్యక్షుడే పార్టీని వీడి ఆర్జేడీలో చేరడం గమనార్హం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని