‘ఆ విషయం తెలియక తలసాని ఛాలెంజ్‌ చేశారు’

తాజా వార్తలు

Published : 21/09/2020 20:11 IST

‘ఆ విషయం తెలియక తలసాని ఛాలెంజ్‌ చేశారు’

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఎద్దేవా  

హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ పరిధిలో లక్ష డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు నిర్మించి పేదలకు పంపిణీ చేస్తామని మంత్రి కేటీఆర్‌ చెప్పారని...కానీ తనకు 3,428 ఇళ్లు మాత్రమే చూపించారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల విషయంలో కాగితాలపై ఉన్న లెక్కలు.. క్షేత్రస్థాయిలో చూపించడం లేదన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద భట్టి మాట్లాడారు. లక్ష ఇళ్లు కట్టలేదనే విషయం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు తెలియక తనతో ఛాలెంజ్‌ చేశారని భట్టి ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌లో ప్రభుత్వ భూములని చూపిస్తే ఇళ్లు కట్టిస్తామని అధికార పార్టీ నేతలు చెబుతున్నారని.. దాని ప్రకారం లక్ష ఇళ్లు కట్టలేదని ఒప్పుకున్నట్లేనని వ్యాఖ్యానించారు.

తెలంగాణ రాష్ట్రం సాధించింది వ్యాపారం చేయడానికి కాదని భట్టి విమర్శించారు. ఫార్మా పేరు చెప్పి ఈ ప్రభుత్వం 7,950 ఎకరాల భూమిని తీసుకుందని ఆయన ఆరోపించారు. ఏ ప్రయోజనాల కోసం భూములు తీసుకున్నారని.. ఫార్మా కంపెనీల వెనుక ఎవరున్నారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ పేదలకు ఇచ్చిన భూములను ఈ ప్రభుత్వం లాక్కుంటే సీఎల్పీకి ఆ వివరాలు అందజేయాలని సూచించారు.  

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని