కేంద్ర ప్రభుత్వానికి సీఎం జగన్‌ లేఖ

తాజా వార్తలు

Published : 18/10/2020 03:34 IST

కేంద్ర ప్రభుత్వానికి సీఎం జగన్‌ లేఖ

అమరావతి: ఏపీ సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన ఏపీని ఆదుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాను కోరారు. తక్షణమే రూ.2250 కోట్లు సాయం చేయడంతో పాటు వరద నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందాన్ని పంపాలని విజ్ఞప్తి చేశారు. వర్షాలు, వరద నష్టంపై రాష్ట్రాన్ని ఆదుకోవాలని లేఖలో కోరారు.

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం కారణంగా ఈ నెల 9నుంచి 13వరకు కురిసిన భారీ వర్షాలకు తీవ్ర నష్టం వాటిల్లింది. తొమ్మిది జిల్లాల్లోని 71,800 హెక్టార్లలో పంట నష్టం జరిగినట్టు లేఖలో సీఎం పేర్కొన్నారు. వరి, మొక్కజొన్న, పత్తితో పాటు అరటి, బొప్పాయి, పలు కూరగాయ పంటలు కూడా నీటమునిగాయని తెలిపారు. భారీ వర్షాల కారణంగా కృష్ణా నదికి వరదలు రావడంతో వేర్వేరు ప్రాంతాల్లో వాగులు పొంగిపొర్లడంతో రవాణా వ్యవస్థ దెబ్బతిందన్నారు. వరద ప్రాంతాల్లో సహాయక కార్యక్రమాల్లో ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌, రెవెన్యూ సిబ్బంది నిర్విరామంగా పనిచేసినా 14మంది మృతి చెందినట్టు సీఎం లేఖలో తెలిపారు. 

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాల నేపథ్యంలో ఈ నెల 14న ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ సీఎం జగన్‌, తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఫోన్‌ చేసిన విషయం తెలిసిందే. వరద పరిస్థితులపై ఆరా తీసిన ఆయన  కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సాయం అందిస్తుందని హామీ ఇచ్చారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని