కేంద్రం అడ్డుకోవడం రాజకీయమే అవుతుంది

తాజా వార్తలు

Published : 16/11/2020 01:10 IST

కేంద్రం అడ్డుకోవడం రాజకీయమే అవుతుంది

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి

హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సన్నాలకు మద్దతు ధర కల్పించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. సన్నాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం బోనస్‌ ఇవ్వడానికి సిద్ధపడినప్పుడు కేంద్రం అడ్డుకోవడం రాజకీయమే అవుతుందని విమర్శించారు. కష్టాల్లో ఉన్న రైతులతో ఆడుకోవడం విజ్ఞత కాదని ఆక్షేపించారు. నియంత్రిత సాగు విధానంలో భాగంగా సన్న రకం ధాన్యాన్ని సాగు చేయాలని సూచించిన సీఎం కేసీఆర్‌ ఈ విషయంలో తప్పించుకోలేరని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలసి క్వింటా సన్నాలకు రూ.2500 చెల్లించాలని చాడ వెంకటరెడ్డి డిమాండ్‌ చేశారు.

హైకోర్టు ఆదేశాలతో సాదాబైనామాల కోసం ప్రత్యేక ఆర్డినెన్స్‌ తీసుకురావడం మంచి పరిణామమని అన్నారు. దీని ద్వారా నిరుపేద సన్న, చిన్నకారు రైతులకు ఉపశమనం కలుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. రెవెన్యూ రికార్డులను సరిచేయడంతో పాటు డిజిటల్‌ సర్వే నిర్వహించి రికార్డులను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలని కోరారు. గడువు ముగిసేలోపు మీ సేవా కేంద్రాలలో దాదాపు 9లక్షల వరకు దరఖాస్తులు వచ్చాయని.. రెవెన్యూ రికార్డుల వాస్తవ పరిస్థితులకు ఇది అద్దంపట్టేలా ఉందని చాడ వెంకటరెడ్డి వివరించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని