నన్ను తప్పించండి.. కోరిన సోనియా

తాజా వార్తలు

Updated : 24/08/2020 12:52 IST

నన్ను తప్పించండి.. కోరిన సోనియా

దిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వంపై చర్చించేందుకు పార్టీ అత్యున్నత విధాన నిర్ణాయక కమిటీ (సీడబ్ల్యూసీ) కీలక భేటీ కొనసాగుతోంది. నాయకత్వ సంక్షోభం నేపథ్యంలో.. పార్టీ కొత్త అధ్యక్షుడి ఎంపికపై ఈ భేటీలో చర్చ జరుగుతోంది. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరుగుతోన్న ఈ భేటీలో మొత్తం 48మంది నేతలు పాల్గొన్నారు. వీరిలో 20మంది సీడబ్ల్యూసీ సభ్యులతోపాటు మరికొంతమంది ప్రత్యేక ఆహ్వానితులు ఉన్నారు. ప్రత్యేక ఆహ్వానితుల జాబితాలో నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఉన్నారు. తాజాగా రాజకీయ సంక్షోభం ఎదుర్కొన్న మధ్యప్రదేశ్, రాజస్థాన్‌ రాష్ట్రాల మాజీ బాధ్యులను కూడా ఈ సారి ఆహ్వానించారు.

పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకునేందుకు తనకు అవకాశం ఇవ్వాలని ఈ సమావేశంలో సోనియాగాంధీ కోరినట్లు సమాచారం. అధ్యక్షుడిగా కొత్త వ్యక్తిని ఎన్నుకోవాలని ఆమె సూచించారు. అయితే సోనియాగాంధీ అధ్యక్షురాలిగా యథావిధిగా కొనసాగాలని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, సీనియర్‌ నేత ఏ.కే.ఆంటోనీ కోరారు.

ఆ లేఖ ఎలా బయటకు వచ్చింది..

పార్టీ ప్రక్షాళన చేయాలంటూ రెండువారాల క్రితం 23మంది కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు రాసిన లేఖపై ఈ భేటీలో వాడీవేడీ చర్చ జరుగుతోంది. సమావేశంలో ఈ లేఖను గులాం నబీ ఆజాద్‌ చదివి వినిపించారు. ఈ లేఖ బయటకు ఎలా లీక్‌ అయిందని కె.సి. వేణుగోపాల్‌ ప్రశ్నించారు. సోనియా అనారోగ్యంతో ఉన్నప్పుడు లేఖ ఎందుకు రాయాల్సి వచ్చిందని రాహుల్‌ గాంధీ పార్టీ నేతలను నిలదీశారు. సరైన సమయం కాదని.. ఆ లేఖ తీవ్రంగా బాధించిందన్నారు. పార్టీ అధినేతగా రాహుల్‌ గాంధీ బాధ్యతలు తీసుకోవాలని రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ ఈ సమావేశంలో కోరినట్లు సమాచారం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని