సొంత మంత్రినే ఒప్పించలేదు, రైతులకేం చెప్తారు?

తాజా వార్తలు

Published : 27/09/2020 01:41 IST

సొంత మంత్రినే ఒప్పించలేదు, రైతులకేం చెప్తారు?

జైపూర్‌: కేంద్రం వ్యవసాయ సంబంధిత బిల్లులతో రైతులను మోసం చేస్తోందని రాజస్థాన్‌ మాజీ ఉపముఖ్యమంత్రి సచిన్‌ పైలట్‌ ఆరోపించారు. ఆ వ్యవసాయ బిల్లుల విషయంలో సొంత కేబినెట్‌లో ఉన్న మంత్రిని ఒప్పించలేకపోయారు.. మరి రైతులను ఏం ఒప్పిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రైతుల బాగు కోసం కేంద్రం వెంటనే ఈ బిల్లుల్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆయన శనివారం కేంద్రంపై విమర్శలు కురిపిస్తూ.. ట్విటర్‌లో ఓ వీడియో విడుదల చేశారు. 

‘వ్యవసాయ బిల్లుల విషయంలో ప్రభుత్వం ఇప్పటికే తప్పు చేసింది. ఆ బిల్లులను వెనక్కి తీసుకోవాలి. రాజ్యసభలో అవి అప్రజాస్వామికంగా ఆమోదం పొందాయి. అందువల్లే ఈ రోజు వాటి విషయంలో దేశవ్యాప్తంగా భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. అదే కారణంతో మంత్రి హర్‌సిమ్రత్‌ కౌర్‌ బాదల్‌ రాజీనామా చేశారు. సొంత మంత్రిని ఒప్పించలేని కేంద్రం.. రైతులను ఎలా ఒప్పించగలదు? రైతులు ప్రతి ఒక్క విషయం అర్థం చేసుకోగలరు. కాంగ్రెస్‌ ఎప్పుడూ రైతుల పక్షానే ఉంటుంది. భాజపా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామనే వాగ్దానాన్ని పక్కన పెట్టింది. కనీసం రాష్ట్రాలను, రైతు సంఘాలతో సంప్రదింపులు జరపకుండా కేంద్రం బిల్లుల్ని పార్లమెంటులో ప్రవేశపెట్టింది. సంస్కరణలు అందరూ కోరుకుంటున్నారు. కానీ ఇవి మాత్రం రైతులకు, దేశానికి వ్యతిరేకమే’ అని పైలట్‌ ఆరోపించారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని