ఆ చట్టాలపై ఆపోహలు తొలగించాలి: చంద్రబాబు

తాజా వార్తలు

Published : 06/12/2020 03:41 IST

ఆ చట్టాలపై ఆపోహలు తొలగించాలి: చంద్రబాబు

అమరావతి: కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలపై జాతీయ స్థాయిలో సమగ్ర చర్చ జరగాలని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ఈ విషయంలో రైతులు, రైతు సంఘాల ప్రతినిధుల ఏకాభిప్రాయం సాధించాలన్నారు. రైతు ప్రయోజనాలే మిన్నగా పాలకుల నిర్ణయాలు ఉండాలని, ఆ చట్టాలపై రైతుల్లో, రైతు సంఘాల్లో ఉన్న అపోహలను తొలగించాలని చంద్రబాబు తెలిపారు. 

అన్ని రాజకీయ పార్టీలు, రైతు సంఘాల ప్రతినిధులతో సమగ్ర చర్చ జరపాలని, అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని చంద్రబాబు కోరారు. రైతాంగానికి మేలైన విధానాలను తీసుకురావాలన్నారు. ‘‘ బిల్లులను హడావిడిగా ప్రవేశపెట్టి తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. సమగ్ర చర్చ ద్వారా ఏకాభిప్రాయం సాధనే సర్వత్రా మేలు. ఈ చట్టాల వల్ల అప్పుల ఊబిలో కుంగిపోతున్న రైతులపై మరింత భారం మోపే ప్రమాదం ఉంది. కనీస మద్దతు ధర రైతుకు చట్టబద్ధమైన హక్కుగా ఉండాలి. కొందరి దయాదాక్షిణ్యాలపై ఆధారపడి ఉండకూడదు’’ అని చంద్రబాబు అన్నారు.

 ఇదీ చదవండి..  వ్యవసాయ చట్టాల్లో సవరణలకు కేంద్రం ఓకేనా?Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని