ప్రైవేటు ఆస్పత్రులకు ఈటల మరో వార్నింగ్‌

తాజా వార్తలు

Published : 11/08/2020 02:21 IST

ప్రైవేటు ఆస్పత్రులకు ఈటల మరో వార్నింగ్‌

హైదరాబాద్‌: కొవిడ్‌ రోగుల చికిత్సకు అధిక బిల్లులు వసూలు చేస్తున్న ఆస్పత్రులకు తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ మరోసారి గట్టి వార్నింగ్‌ ఇచ్చారు. అధిక బిల్లుల వసూళ్లపై ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వానికి 1039 ఫిర్యాదులు అందాయని తెలిపారు. సోమవారం ఆయన వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ప్రైవేటు ఆస్పత్రులపై వచ్చిన ఫిర్యాదులపై సమీక్షించారు. ఫిర్యాదులు వచ్చిన ఆస్పత్రులకు నోటీసులు ఇచ్చామనీ.. ఆయా ఆస్పత్రుల యాజమాన్యాలు వాటి తీరును మార్చుకోవాలని సూచించారు. లేకపోతే ప్రైవేటు ఆస్పత్రుల్లో 50శాతం పకడలు ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని