వెంటనే యూపీ వెళ్లాలనిపిస్తోంది: మమత

తాజా వార్తలు

Updated : 04/10/2020 01:40 IST

వెంటనే యూపీ వెళ్లాలనిపిస్తోంది: మమత

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ హాథ్రస్‌ అత్యాచార ఘటనను నిరసిస్తూ శనివారం తృణమూల్‌ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. కోల్‌కతాలోని బిర్లా ప్లానిటోరియం నుంచి సెంట్రల్‌లోని గాంధీ విగ్రహం వరకు ఈ ర్యాలీ సాగింది. ఇందులో టీఎంసీ మద్దతుదారులు భారీ సంఖ్యలో  పాల్గొన్నారు. వీరితో పాటు కాంగ్రెస్‌ సహా ఇతర వామపక్షాలు సైతం నిరసనలకు పిలుపునిచ్చాయి. ఈ సందర్బంగా మమతా బెనర్జీ మాట్లాడుతూ.. భాజపా దళితులను కేవలం ఓట్ల కోసం మాత్రమే ఉపయోగించుకుంటోందని ఆరోపించారు. ఎన్నికల సమయంలోనూ దళితుల ఇళ్లకు వెళ్లి వారి ఇంట్లో తినకుండా బయటి నుంచి తెప్పించుకుని తిని వారి మనోభావాలను దెబ్బతీశారని విమర్శించారు. ఓట్లకు మాత్రం వారిని ఉపయోగించుకుని ఎన్నికల తర్వాత దళితులపై దాడులు చేస్తున్నారని ఆరోపణలు చేశారు. హాథ్రస్‌ ఘటనపై ప్రస్తుతం తనకు యూపీకి బయలుదేరి వెళ్లాలనిపిస్తోందన్నారు. శుక్రవారం టీఎంసీ ఎంపీలను హాథ్రస్‌ పంపగా.. పోలీసులు వారిని అడ్డుకోవడమే కాకుండా.. అందులో మహిళా ఎంపీపై చేయి చేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  

కాగా హాథ్రస్‌ ఘటనపై దేశవ్యాప్తంగా పలు ప్రతిపక్ష పార్టీల నుంచి నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై సుప్రీంకోర్టు సమక్షంలో విచారణ చేపట్టాలని శిరోమణి అకాలీదళ్‌ అధ్యక్షుడు సుఖ్‌బీర్‌ సింగ్‌ బాదల్‌ డిమాండ్‌ చేశారు. మరోవైపు బాధిత కుటుంబానికి సీఆర్పీఎఫ్‌ బలగాలతో రక్షణ కల్పించాలని శివసేన పార్టీ ఎంపీ ప్రియాంక చతుర్వేది డిమాండ్‌ చేశారు. ప్రస్తుతం యూపీలోని హాథ్రస్‌ అత్యాచార బాధిత కుటుంబాన్ని కలిసేందుకు కాంగ్రెస్‌ అగ్రనాయకులు రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీ బయలుదేరారు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని