రాజకీయంగా కుట్ర చేసి చంపారు:జేడీఎస్

తాజా వార్తలు

Published : 30/12/2020 01:47 IST

రాజకీయంగా కుట్ర చేసి చంపారు:జేడీఎస్

బెంగళూరు: కర్ణాటక శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్, జేడీఎస్ ఎమ్మెల్సీ ధర్మెగౌడ బలవన్మరణానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆ పార్టీ నేత, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి స్పందించారు. ఇది రాజకీయ కుట్ర అని, వెంటనే నిజ నిర్ధారణ కమిటీ వేసి, దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. 

ఇటీవల విధాన పరిషత్ లో జరిగిన ఘటనలు ధర్మెగౌడను కలవరపరిచాయని కుమారస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘రాజకీయంగా కుట్ర చేసి, ఈ హత్య చేశారు. గౌడను ఛైర్మన్ సీటు నుంచి కిందికి లాక్కెళ్లి, అవమానించారు. వారు చేసింది తప్పో, ఒప్పో ఒకసారి వారి మనస్సాక్షిని ప్రశ్నించుకోవాలి’ అని కాంగ్రెస్‌ వ్యవహరించిన తీరును తప్పుపట్టారు. 

డిసెంబర్ 15న కర్ణాటక విధాన పరిషత్ సమావేశాల్లో రసాభాస జరిగింది. ఛైర్మన్ కే చంద్రప్రతాప్‌ శెట్టిపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా సభ్యులు వాగ్వాదాలకు దిగారు. మాటల దాడులతో పాటు ఒకరినొకరు తోసుకున్నారు. సభాపతి స్థానంలో ఉన్న ధర్మెగౌడను కాంగ్రెస్ సభ్యులు ఛైర్మన్‌ సీటు నుంచి లాక్కెళ్లారు. ఇదిలా ఉండగా, సోమవారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లిన ధర్మెగౌడ..మంగళవారం రైల్వే ట్రాక్ పక్కన శవమై కనిపించారు. ఆయన రైలు కింద పడి సూసైడ్ చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆయన మరణంపై రాజకీయ పక్షాలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. 

ఇవీ చదవండి: 

కర్ణాటక మండలి డిప్యూటీ ఛైర్మన్ ఆత్మహత్య
 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని