అనారోగ్యానికి కారణాలు విశ్లేషించాలి: పవన్‌

తాజా వార్తలు

Published : 07/12/2020 00:55 IST

అనారోగ్యానికి కారణాలు విశ్లేషించాలి: పవన్‌

అమరావతి: పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు వన్‌టౌన్‌ పరిధిలో అస్వస్థతకు గురైన బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రభుత్వాన్ని కోరారు. వందల సంఖ్యలో ప్రజలు ఒకేసారి అస్వస్థతకు గురికావడం ఆందోళన కలిగిస్తోందన్నారు. ప్రజల అనారోగ్యానికి గల కారణాలను సాధ్యమైనంత త్వరగా వైద్యులు విశ్లేషించాలని పవన్‌ కల్యాణ్‌ కోరారు. 

ఏలూరు వన్‌టౌన్‌ పరిధిలో శనివారం రాత్రి అస్వస్థతకు గురైన దాదాపు 140 మంది బాధితులు ఆస్పత్రి నుంచి డిశ్ఛార్జి అయ్యారు. అయితే అస్వస్థతకు గురై ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఈ ఉదయం నుంచి 46 మంది బాధితులు ప్రభుత్వ ఆస్పత్రిలో చేరగా.. మరో 60 మంది ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ అంతుపట్టని వ్యాధికి కారణాలు మాత్రం ఇప్పటివరకు వైద్యులు ధ్రువీకరించలేదు.

ఇవీ చదవండి..

ప్రజల ప్రాణాలంటే లెక్కలేని తనమా?

100 మందికి అస్వస్థతTags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని