ఝార్ఖండ్‌ సీఎం రూ.100 కోట్ల పరువునష్టం దావా

తాజా వార్తలు

Published : 08/08/2020 17:10 IST

ఝార్ఖండ్‌ సీఎం రూ.100 కోట్ల పరువునష్టం దావా

ఫేస్‌బుక్‌పై కూడా...

రాంచీ: తన ప్రతిష్టకు భంగం కలిగే విధంగా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం సాగిస్తున్నారంటూ ఝార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ రూ.100 కోట్ల పరుపునష్టం దావాను రాంచీ సివిల్‌ కోర్టులో దాఖలు చేశారు. భాజపా ఎంపీ డాక్టర్‌ నిషికాంత్‌ దూబె తనపై అసత్య ప్రచారం సాగిస్తున్నారంటూ ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆగస్టు 4న నమోదయిన ఈ కేసులో ఎంపీతో పాటు, సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ (ఇండియా)ను కూడా ప్రతివాదిగా చేర్చారు. వీరిద్దరూ తనకు నష్టపరిహారంగా రూ.100 కోట్లు ఇవ్వాలని ముఖ్యమంత్రి న్యాయస్థానాన్ని అభ్యర్ధించారు.

 గోడ్డా నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న దూబె, వివిధ అంశాలను గురించి ముఖ్యమంత్రిపై తీవ్ర విమర్శలకు పాల్పడ్డారు. సోరెన్‌ 2013లో ముంబయిలో ఓ మహిళను అపహరించి, అత్యాచారానికి పాల్పడినట్టు ఆయన ట్విటర్‌ వేదికగా ఆరోపించారు. ఇందుకు ముఖ్యమంత్రి స్పందిస్తూ.. ఈ ఆరోపణలకు న్యాయపరంగా సమాధానమివ్వగలనని జవాబిచ్చారు. నిషికాంత్‌ , జులై 27 నుంచి తనకు వివిధ కుంభకోణాలు, నేరాలతో ముడిపెట్టి తన పేరుప్రతిష్టలకు భంగం కలిగించే విధంగా సోషల్‌మీడియాలో ప్రకటనలు చేస్తున్నారని హేమంత్‌ సోరెన్‌ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విధమైన అమర్యాదకరమైన పోస్టులను నిరోధించనందుకు, కనీసం తొలగించనందుకు ట్విటర్‌, ఫేస్‌బుక్‌ ఇండియాలను ప్రతివాదులుగా చేసినట్టు తెలిపారు.

ఇందుకు ఎంపీ స్పందిస్తూ... ‘‘ముఖ్యమంత్రివర్యా! ముంబయికి చెందిన ఓ యువతి మీపై అపహరణ, మానభంగ ఆరోపణలు చేశారు. కాగా మీరు ఆమెపై కాకుండా నాపై కేసులు వేస్తున్నారు. మీకు వ్యతిరేకంగా పోరాడేందుకు నాకో అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు.’’ అని ట్విటర్‌లో సమాధానమిచ్చారు. ఈ కేసు విచారణ ఆగస్టు 5న ప్రారంభం కాగా.. తదుపరి విచారణ ఆగస్టు 22న జరుగనుంది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని