close

తాజా వార్తలు

Updated : 22/11/2020 11:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఈసారి సెంచరీ కొట్టేద్దాం: కేటీఆర్‌

హైదరాబాద్: అందరి హైదరాబాద్‌ను కొందరి హైదరాబాద్‌గా మార్చాలని విపక్షాలు ప్రయత్నిస్తున్నాయని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ఆరోపించారు. గ్రేటర్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా కూకట్‌పల్లి ఓల్డ్‌ అల్లాపూర్‌, మూసాపేట, ఐడీపీఎల్‌ చౌరస్తాల్లో కేటీఆర్ ప్రసంగించారు. గత ఎన్నికల్లో ఒక్క సీటుతో తెరాస సెంచరీ కోల్పోయిందని.. ఈసారి జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో శతకం పూర్తి చేయాలన్నారు. సీఎం కేసీఆర్‌ ప్రజలందరినీ కలుపుకొని వెళ్తున్నారని.. ప్రశాంతమైన హైదరాబాద్‌ కోసం తెరాసనే గెలిపించాలని ప్రజలను కోరారు. ఆరేళ్లలో కేసీఆర్‌ ప్రభుత్వం అనేక సంక్షేమ పనులు చేసిందన్నారు. రాష్ట్రంలో పేకాట క్లబ్బులు, గుడుంబా గబ్బులు, మత కల్లోలాలు ఎక్కడా లేవన్నారు. ప్రజల కోసం పనిచేసే వారిని తిరిగి కార్పొరేషన్‌కు పంపించాలని కేటీఆర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

‘‘ఆరేళ్లలో హైదరాబాద్‌లో మంచి జరిగిందా? చెడు జరిగిందా? అనే విషయాన్ని ప్రజలు ఆలోచించాలి. నగరంలో ఆరేళ్ల క్రితం ఉన్న పరిస్థితులు ఇవాళ లేవు. అన్ని రకాలుగా హైదరాబాద్‌ను అభివృద్ధి చేసుకున్నాం. ప్రజల సహకారంతో విద్యుత్‌, మంచినీళ్ల సమస్యను పరిష్కరించాం. తెరాస రూ.10వేలు ఇస్తామంటే ఆపిన వారు ఇవాళ రూ.25 వేలు ఇస్తారట. కావాలని జుమ్మా రోజు భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద ధర్నా చేశారు. ఆలయాల వద్ద ధర్నాలు చేయడంలో మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. అయితే చార్మినార్‌ వద్దే ఎందుకు? నగరంలో మరెక్కడా దేవాలయాలు లేవా?ఎందుకంటే.. హిందు, ముస్లింలు కలిసి ఉంటే వారికి నచ్చదు. హైదరాబాద్‌ పచ్చగుంటే వారు ఓర్వలేకపోతున్నారు. ఎలాగైనా ప్రజలు మధ్యలో చిచ్చుపెట్టి అశాంతిని రేకెత్తించాలి. ఇక ఈ మంటల్లో నాలుగు ఓట్లు సంపాదించుకోవాలి. అభివృద్ధి కావాలా? అరాచకం కావాలా? ప్రజలే ఆలోచించాలి. ఏ రకమైన హైదరాబాద్ ఉంటే మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయో ప్రజలే తేల్చుకోవాలి’’ అని కేటీఆర్‌ అన్నారు.

బాలాపూర్‌లో..

‘‘ఇచ్చిన ప్రతి మాటా నిలబెట్టుకునే బాధ్యత మాది. తెలంగాణ ఏర్పడినప్పుడు హైదరాబాద్‌లో ఏం జరుగుతుందో అనే అనుమానాలు ఉండేవి. రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు రావడం కాదు.. ఉన్నవే పోతాయని కొంత మంది అన్నారు. ప్రస్తుతం పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. రాష్ట్రంలో కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేందుకు అంతర్జాతీయ సంస్థలు ముందుకొస్తున్నాయి. ఇవేవీ విపక్షాలకు కనిపించడం లేదా? రోజు 50వేల మందికి రూ.5కే భోజనం అందిస్తున్నాం. తొందర్లోనే లక్ష రెండు పడకల ఇళ్లు పంపిణీ చేస్తాం. కరోనా వచ్చినా.. వరద వచ్చినా.. మీకు అండగా ఉన్నాం. సంక్రాంతిలోగా బాలానగర్‌ వంతెనను పూర్తి చేస్తాం’’ అని కేటీఆర్‌ వివరించారు.  



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.