రౌత్‌ X రనౌత్‌: కంగన మెంటల్‌ కేస్‌...

తాజా వార్తలు

Published : 04/09/2020 20:07 IST

రౌత్‌ X రనౌత్‌: కంగన మెంటల్‌ కేస్‌...

తనని అక్కడికే పంపించండి: సంజయ్‌ రౌత్

ముంబయి: ముంబయి పాక్‌ ఆక్రమిత కశ్మీరులా ఉందన్న బాలీవుడ్ నటి రనౌత్‌ వ్యాఖ్యలపై.. శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ మండిపడ్డారు. కంగనకు పిచ్చి పట్టిందని.. ప్రభుత్వం ఆమెను పీఓకేకే పంపాలని ఆయన విమర్శించారు. ‘‘కంగనా రనౌత్‌ ఓ మెంటల్‌ కేసు. తను తినే కంచంలోనే ఉమ్ము వేసే రకం. కొన్ని రాజకీయ పార్టీలు ఆమెకు సహాయంగా నిలుస్తున్నాయి. ఆమెను పీఓకేకే వెళ్లనివ్వండి. ఆమె రెండు రోజులు పీఓకే పర్యటనకు ప్రభుత్వం నిధులు సమకూర్చాలి. లేదా ఆమె పర్యటనకయ్యే ఖర్చు భరించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. అయినా పీఓకే మన దేశంలో భాగమే అని ప్రభుత్వం అంటోంది. మరి కంగన దేని గురించి మాట్లాడుతున్నట్టు? మోదీజీ పీఓకే మీద ఆకస్మిక దాడులు (సర్జికల్‌ స్ట్రైక్స్) చేయించారు. మరి కంగన ఎవరి పక్షాన నిలబడుతుంది? ఉగ్రవాదుల వైపా? అసలు ఆమె మానసిక పరిస్థితి ఏమిటి?’’ అని రౌత్‌ ప్రశ్నించారు.

తాము మహిళలను గౌరవిస్తామని అయితే ఆమె వాడుతున్న భాష సరిగాలేదని సంజయ్‌ రౌత్‌ అన్నారు. తమకు ఆమెతో వ్యక్తిగత వైరమేదీ లేదన్న ఎంపీ‌.. ఆమె మహారాష్ట్రను ముంబయి పోలీసులను అవమానించడం సరికాదన్నారు. ఆమెకు ముంబయి నగరం కెరీర్‌ను, పేరు ప్రతిష్టలను ఇచ్చిందని, మనల్ని కాపాడేందుకు ముంబయి పోలీసులు ప్రాణాల్పిస్తున్నారన్నారు.

ఇలా మొదలైంది..

సుశాంత్‌ మృతి నేపథ్యంలో తనకు మూవీ మాఫియా కంటే ముంబయి పోలీసులంటేనే తనకు ఎక్కువ భయంగా ఉందని, తనకు భద్రత కల్పించాలని కంగనా రనౌత్‌ కోరారు. దీనితో సంజయ్‌ రౌత్‌, ఆమెను ముంబయి తిరిగి రాకుండా అక్కడే ఉండిపోవాలని సూచించారు. కాగా, ఆయన తనను బెదిరిస్తున్నారని.. ముంబయి తనకు  పాక్‌ ఆక్రమిత కశ్మీరులా (పీఓకే) అనిపిస్తోందని కంగన ట్వీట్‌ చేశారు. ఈ విధంగా మొదలైన వాగ్యుద్ధం చర్చనీయాంశమవుతోంది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని