వ్యవసాయచట్టాలపై కేరళ అసెంబ్లీ ప్రత్యేక భేటీ
close

తాజా వార్తలు

Updated : 21/12/2020 19:18 IST

వ్యవసాయచట్టాలపై కేరళ అసెంబ్లీ ప్రత్యేక భేటీ

చట్టాల రద్దు కోరుతూ తీర్మానం చేయనున్న అసెంబ్లీ

తిరువనంతపురం: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం ఒక ప్రత్యేక కేబినెట్‌ సమావేశం ఏర్పాటు చేసి ఈ నిర్ణయం తీసుకుంది. తిరువనంతపురంలో ఈ సమావేశం జరిగింది. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా తీర్మానం చేసేందుకు డిసెంబరు 23న ఒక ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని వారు నిర్ణయించారు. కేరళ ఆర్థికశాఖ మంత్రి థామస్‌ ఐజాక్‌ ఈ సమాచారాన్ని ధ్రువీకరించారు. దేశరాజధాని సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఆందోళనకు కేరళ ప్రభుత్వం సంఘీభావాన్ని ప్రకటిస్తోందని ఆయన తెలిపారు. కేరళ బడ్జెట్‌ సమావేశాలు వచ్చే ఏడాది జనవరి 8 నుంచి జరగనున్న నేపథ్యంలో ఈ లోపే నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేక తీర్మానాన్ని ఆమోదించాలని వారు నిర్ణయించుకున్నారన్నారు. దీని కోసం  ప్రత్యేకంగా తక్కువ నిడివిగల అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని వారు కేబినెట్‌ సమావేశంలో చర్చించారని తెలిపారు.

ఇవీ చదవండి..

‘తూత్తుకుడి’పై రజనీకాంత్‌కు మరోసారి సమన్లు


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని