ఎన్ని కేసులు పెట్టినా వెనక్కితగ్గను: లోకేశ్‌

తాజా వార్తలు

Published : 28/10/2020 00:41 IST

ఎన్ని కేసులు పెట్టినా వెనక్కితగ్గను: లోకేశ్‌

అమరావతి: వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన తనపై ప్రభుత్వం అకారణంగా కేసులు నమోదు చేస్తోందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ మండిపడ్డారు. పంటలు నీట మునిగి రైతులు తీవ్ర ఆవేదనలో ఉంటే కనీసం వారిని పలకరించని ముఖ్యమంత్రి జగన్‌.. బాధితులకు భరోసా కల్పించేందుకు వెళ్లిన తనపై కేసులు పెడుతున్నారని ట్విటర్‌ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా ప్రతి ఊరూ వెళ్లి కష్టాల్లో ఉన్నవారి కన్నీళ్లు తుడుస్తానని లోకేశ్‌ అన్నారు. తనపై కేసులు పెట్టేందుకు ఎలాంటి సెక్షన్లు దొరక్క ట్రాక్టర్‌ నడిపానని, కొవిడ్‌ నిబంధనలు ఉల్లంఘించానంటూ కేసులు పెడుతున్నారని లోకేశ్‌ ఎద్దేవా చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని